జగన్ పై కోపంతో షర్మిల షాకింగ్ కామెంట్స్?

Purushottham Vinay
ఇక విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు శాసనసభ శానసమండలిలోనూ బిల్లును పెట్టి ఆమోదించుకుంది. ఈ నిర్ణయంపై టీడీపీ జనసేన బీజేపీ కమ్యూనిస్టు పార్టీలు సహా వివిధ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఎన్టీఆర్ పేరునే యూనివర్సిటీకి ఉంచాలని డిమాండ్ చేశాయి. యూనివర్సిటీకి పేరు మార్చడాన్ని నిరసిస్తూ స్వయంగా వైఎస్ఆర్సీపీలోనే ఉన్న అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలాంటి వాళ్లు పేరు మార్చొద్దని జగన్ కు విన్నవించారు.ఇక ఇదే వ్యవహారంపై జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కూడా కొద్ది రోజుల క్రితం స్పందించారు. జగన్ నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పేరు మారిస్తే ఆ పేరుకున్న పవిత్రత పోతుందన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పేరు మార్చుకుంటూ వెళ్లడం సరికాదన్నారు. ఒక పేరు అంటూ పెట్టాక అదే పేరును కొనసాగించాలన్నారు.


ఇలా పేర్లు మారిస్తే అప్పటివరకు ఆ సంస్థకున్న పవిత్రత పోతుందన్నారు. అంతేకాకుండా అనవసరమైన అయోమయాన్ని సృష్టించినట్టు అవుతుందన్నారు. ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే ఎవరు ఏది రిఫర్ చేస్తున్నది కూడా అర్థం కాదని షర్మిల అన్నారు. ఉన్న పేరునే కొనసాగిస్తే ఆ పేరును తరతరాలు గౌరవించినట్టు అవుతుందని చెప్పారు.ఇప్పుడు మరోమారు కూడా షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఉన్న పేరును తొలగిస్తే ఆ మనిషిని అవమానించినట్టే. ఆయనను ఆరాధించే కోట్లాది మంది మనుషులను కూడా అవమానించినట్టేనని అన్నారు. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి వైఎస్సార్ పేరును తొలగించి పాత పేరునే కొనసాగిస్తే అప్పుడు ఆయనను అవమానించినట్టు అవుతుందన్నారు. ఎన్టీఆర్ ఖ్యాతిని వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆయనకున్న పేరుప్రఖ్యాతులు ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేవని షర్మిల సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: