సీఎం జగన్ అలాంటి నిర్ణయాల వెనుక ఉన్నదెవరు ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే పనుల మీదనే తన దృష్టిని కేంద్రీకరించారు. కానీ రాష్ట్రం కు ఏదైతే అవసరమో ఆలోచించలేకపోయారు. ముఖ్యంగా కొత్తగా ఉమ్మడి రాష్ట్రం నుండి వేరు పడ్డాక ఆర్ధిక మూలాలు బాగా దెబ్బతిన్నాయి. కాబట్టి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టె కంపెనీలను తీసుకురావడం మీద శ్రద్ద చూపాల్సింది. అయితే పూర్తి స్థాయిలో కంపెనీలు రాలేదని కాదు.. ఇంకా చేయాల్సి ఉండాల్సింది. ఇక రాష్ట్రంలో రైతన్నకు ప్రాణాధారమైన నీరు.. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా, కారణాలు ఏవైనా ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి.
ఇక నిరుద్యోగ సమస్య కూడా పెనుభూతంలా మెడకు చుట్టుకుంటోంది. దీనికి వార్డ్ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు.  వాస్తవానికి ఇవి అర్హతకు తగిన ఉద్యోగాలు కాదనే చెప్పాలి. డిగ్రీ చదివిన వారు సైతం వాలంటీర్ లుగా చేసుకుంటున్నారు. ఇలా కొన్ని సమస్యలు ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేస్తున్నాయి. కానీ సీఎం జగన్ కు ఇవేమీ పట్టడం లేదు... సరికదా ప్రజల గుండెల్లో నాటుకుపోయిన కొన్ని అంశాలను మరియు సెంటిమెంట్ లను కాలరాస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు జగన్ కు వ్యతిరేకత పెరగడంలో తోడ్పడుతున్నాయి అని చెప్పవచ్చు.
జగన్ అనవసరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజలకు ఆగ్రహం తెప్పించాయి. అందులో ఒకటి... ఎన్టీఆర్ పేరిట ఉన్న యూనివర్సిటీ పేరును కాస్తా వైఎస్సార్ యూనివర్సిటీ మారుస్తూ బిల్లును తీసుకురావడం ఇప్పుడు రాష్ట్రం అంతటా చర్చ జరుగుతోంది. కొందరు డైరెక్ట్ గా చెప్పకపోయినా సొంత పార్టీలోని నేహతలకే ఈ విషయం నచ్చడం లేదు. అయితే కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మనకు నెగటివిటీ ఏర్పడుతుందని తెలిసినా ఎందుకు అదే పొరపాట్లను జగన్ చేస్తున్నారు అన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. అయితే కొందరు ఏమో... ఇలాంటి నిర్ణయాలు జగన్ సొంతం తీసుకున్నవి కాకపోవచ్చని అంటున్నారు. జగన్ ను మానిప్యులేట్ చేసి ప్రభుత్వంపై వ్యతిరేకత కలిగేలా కొందరు ప్రభుత్వంలో పనిచేస్తున్నారని అంటున్నారు. మరి ఈ నిర్ణయాల వెనుక ఎవరు ఉన్నారన్నది తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: