స్కూల్ వెళ్తున్న కొండెంగా.. షాక్ అవుతున్న నెటిజన్స్?

praveen
సాధారణం గా విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే చాలు ఎంతో మారాం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా పాఠశాలలకు వెళ్ళకుండా ఎలా ఎగొట్టాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. తల్లి దండ్రులు మాత్రం ఏదో ఒకటి సర్దిచెప్పి  పిల్లలను పాఠశాలకు పంపించడం లాంటివి చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే సాధారణం  గా విద్యార్థులు ఇలా పాఠశాలకు వెళ్లేందుకు ఎంతో బాధ పడి పోతూ ఉంటే.. ఇక్కడ మాత్రం ఏకంగా ఒక కొండెంగ  రోజు పాఠశాలకు వెళుతూ ఉంది. కొండేంగా ఏంటి పాఠశాల తిరగడమేంటి అదేమైనా చదువుకుంటుందా అని అనుకుంటున్నారు కదా.

 కానీ ఇక్కడ మాత్రం ఇలాగే జరుగుతుంది అని చెప్పాలి. పాఠశాలలో గత వారం రోజుల నుంచి విద్యార్థుల తో కలిసి హాజరవుతూ ఉంది.  ఉపాధ్యాయులు విద్యార్థులు సైతం ఈ విషయం చూసి ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా పాఠశాల మొత్తం తిరుగుతున్న కొండేంగా చివరికీ ఎలాంటి హాని చేయడం లేదు అని చెప్పాలి. కనీసం ఎవరిని బెదిరించడం లాంటివి కూడా చేయడం లేదు. ప్రతి రోజు క్రమం తప్పకుండా క్లాసులకు హాజరవుతోంది కొండేంగా.

 ఉదయం 9 గంటలకు పాఠశాల తెరిచిన వెంటనే పాఠశాల ప్రాంతానికి చేరుకుంటుంది. విద్యార్థులందరికీ  పాఠశాల సమయం ముగిసిన తర్వాతే ఆ కొండేంగా కూడా స్కూలు నుంచి బయల్దేరుతుంది అని ఇక ఆ పాఠశాల లో పనిచేసే ఉపాధ్యాయులు చెబుతుండడం గమనార్హం. మొదట 9వ తరగతిలో ప్రవేశించడంతో విద్యార్థులు  భయాందోళనకు గురయ్యారు. అయినప్పటికీ ఎవరికీ హాని తలపెట్టకుండా.. విద్యార్థులతోపాటు క్లాస్ లో ని బెంచిపై కూర్చుంది అంటూ ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు.. విద్యార్థులు అయినా డుమ్మా కొడతారేమో కానీ కొండెంగా మాత్రం డుమ్మా కొట్టకుండా స్కూలుకి వస్తుంది. ఇక ఇలా రోజూ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు అంటూ చెబుతున్నారు ఉపాధ్యాయులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: