అమరావతి : టీడీపీకి జగన్ ఊహించని షాకిచ్చారా ?

Vijaya






గురువారం మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశంపార్టీకి జగన్మోహన్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ఉదయం మొదలైన బీఏసీ (బిజెనస్ అడ్వయిజరీ కమిటి) సమావేశంలోనే షాక్ తగిలింది. ఎలాగంటే సమావేశాల్లో టీడీపీ చర్చించాలని అనుకున్న ప్రతి అశంపైనా డీటైల్డ్ గా చర్చించేందుకు జగన్ అంగీకరించారు. అలాగే టీడీపీ అడగని అంశాలను కూడా స్వయంగా జగనే ప్రతిపాదించారు. తమ ప్రతిపాదనకు జగన్ అంగీకరిస్తారని టీడీపీ శాసనసభాపక్ష నేత అచ్చెన్నాయుడు ఏమాత్రం ఊహించలేదు.



అలాగే తాము ప్రస్తావించని అంశాలను కూడా జగన్ గుర్తుచేసి చర్చకు రెడీ అంటారని అచ్చెన్న అనుకోలేదు. కాకపోతే జగన్ చెప్పిన కండీషన్ ఏమిటంటే సభలో అనవసరంగా గొడవలు చేయటం, ఒకరిని మరొకరు రెచ్చగొట్టుకునేట్లుగా వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు వద్దన్నారు. తన కండీషన్ కు టీడీపీ సహకరించేట్లయితే సభలో ఎన్ని అంశాలపైన చర్చించేందుకైనా తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టంగా చెప్పారు. దాంతో ఏమి సమాధానం చెప్పాలో అచ్చెన్నకు అర్ధంకాలేదు.



రాజకీయాలకు సంబంధంలేని ఇంట్లోని మహిళలను కూడా వైసీపీ నేతలు రోడ్డుకీడుస్తున్నారంటు అచ్చెన్న ఆరోపించారు. దానికి కూడా జగన్ సమాధానం చెప్పారు. మొదటి ఇంట్లో ఆడవాళ్ళని ఎవరు రోడ్డుమీదకు ఈడ్చారనే విషయాన్ని అచ్చెన్నకు జగన్ గుర్తుచేశారు. దాంతో అచ్చెన్న సమాధానం చెప్పలేకపోయారు. ఇంట్లో ఆడవాళ్ళని రోడ్డుమీదకు లాగటాన్ని టీడీపీ నిలిపేస్తే తమ నేతలు కూడా ఆటోమేటిగ్గా ఆపేస్తారని జగన్ చెప్పారు.



దాంతో మాట్లాడటానికి ఏమీలేక సభ మొదలుకాగానే టీడీపీ సభ్యులు గోల మొదలుపెట్టారు. తన పుట్టుకగురించి మంత్రి మేరుగ నాగార్జున అసభ్యంగా మాట్లాడారంటు టీడీపీ సభ్యుడు డోలా బాలవీరంజనేయస్వామి ఆరోపణలు మొదలుపెట్టారు. ఈ అంశంమీదే సభలో చాలాసేపు గోల జరిగింది. అంటే ప్రజా సమస్యలపై  సభలో చర్చించేందుకు టీడీపీకి ఇష్టంలేదని అర్ధమైపోతోంది. ఏదో రకంగా సభలో గోలచేయాలి, సభను సజావుగా సాగనీయకుండా అడ్డుకోవాలన్నదే ప్రధాన ఎజెండాగా తెలిసిపోయింది. అందుకనే ఎంతసేపు చెప్పినా వినకపోవటంతో చేసేదిలేక టీడీపీ సభ్యులను స్పీకర్ ఒక్కరోజు సస్పెండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: