అమరావతి : చంద్రబాబు పరువు తీసేసిన కొలికపూడి

Vijaya


కొలికపూడి శ్రీనివసరావు..సోషల్ మీడియా, టీవీ డిబేట్లను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకి ఈ పేరు కొత్తగా పరిచయటం అవసరంలేదు. వ్యక్తిగతంగా కొలికపూడితో పరిచయటం లేనివాళ్ళకు కూడా ఆయన ఆలోచనలు ఏమిటో తెలిసిపోతుంది. ఎలాగంటే 24 గంటలూ చంద్రబాబునాయుడుకి మద్దతుగా మాట్లాడటమే కొలికపూడి లక్ష్యం. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం కూడా ఇందులో భాగమే. ఇలాంటి వ్యక్తి ఒక సభలో డైరెక్టుగా చంద్రబాబు పరువు తీసేయటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇంతకీ విషయం ఏమిటంటే అమరావతి మీద ఒక జర్నలిస్టు పుస్తకాన్ని రచించారు. దాని ఆవిష్కరణ సభ అమరావతిలోనే జరిగింది. ఆ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు కొలికపూడి, తులసీరెడ్డి, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, కన్నా లక్ష్మీనారాయణతో పాటు చాలామందే వేదికమీద కనిపించారు. ఇలాంటి సభలో కొలికపూడి మాట్లాడుతు అమరావతి గురించి గతంలో తాము కాంగ్రెస్ సీనియర్ నేత జై రామ్ రమేష్ తో మాట్లాడేందుకు కలిసినట్లు చెప్పారు.జై రామ్ ను కలిసి అమరావతి అని అనగానే ’దటీజ్ నాట్ అమరావతి దటీజ్ కమ్మరావతి..చంద్రబాబు బిల్ట్ దట్ సిటి ఫర్ హిస్ ఓన్ పీపుల్’ అని అన్నట్లు స్టేజి మీదే చెప్పేశారు. తానసలు అమరావతి అని పూర్తిగా చెప్పకుండానే జై రామ్ రమేష్ అమరావతి కాదు కమ్మరావతి అని అన్నారని కొలికపూడి చెప్పటంలో అర్ధమేంటి ? చంద్రబాబు ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా ప్రకటించారో అప్పటి నుండే అది కమ్మోరి కోసమే ఏర్పాటు చేసిందని, అమరావతి ప్రాజెక్టు అచ్చంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే అనే ప్రచారం విస్తృతంగా ఉంది.ప్రచారానికి తగ్గట్లే అమరావతిలో చంద్రబాబు బినామీలు, టీడీపీ నేతల్లో కొందరు భారీగా భూములు కొనుగోలు చేశారనే ప్రచారానికి కొదవేలేదు. దీనిమీద 2019 ఎన్నికల్లో జనాలు టీడీపీని ఘోరంగా ఓడించటంలో అమరావతి అంశం కూడా కీలకమైనదే. ఇటువంటి సమయంలో హఠాత్తుగా కొలికపూడి కమ్మరావతి అనే జై రామ్ రమేష్ కామెంటును ఎందుకు తెచ్చినట్లు ? అదికూడా అమరావతికి మద్దతుగా రాసిన పుస్తకం ఆవిష్కరణ సభలో. మొత్తానికి చంద్రబాబుకు ఎంతో నమ్మకస్తుడైన కొలికపూడే చంద్రబాబు పరువు తీసేసినట్లయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: