హైదరాబాద్ : బీజేపీ ట్రాపులో కేసీయార్ విలవిల

Vijaya







బీజేపీ ట్రాపులోపడి కేసీయార్ విలవిల్లాడిపోతున్నారు. ఇందుకనే ఈ నెల 16, 17, 18 తేదీల్లో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరపాలని తెలంగాణా క్యాబినెట్లో తీర్మానం పాస్ చేయించారు. రాష్ట్ర విభజన జరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిదిన్నరేళ్ళకు కేసీయార్ కు తెలంగాణా విమోచన దినోత్సం జరపాలని గుర్తుకురావటమే ఆశ్చర్యంగా ఉంది.




ప్రత్యేక తెలంగాణా ఉద్యమం జరుగుతున్న రోజుల్లో  సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణా విమోచన దినోత్సవంగా జరపాలని ఇదే కేసీయార్ కొన్ని వందలసార్లు డిమాండ్ చేసుంటారు. రాష్ట్రవిభజన జరిగి కేసీయార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణా విమోచన దినోత్సవం ఊసెత్తితే ఒట్టు. ఎందుకంటే టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా మారిన ఎంఐఎం పార్టీ తెలంగాణా విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు అంగీకరించలేదు. నిజాం పాలన నుండి తెలంగాణాకు విముక్తి లభించిన రోజును విముక్తి దినోత్సవంగా జరపాలని ఉద్యమసమయంలో అనుకున్నారు.



ఇక్కడ సమస్య ఏమిటంటే విమోచన దినోత్సవం అంటే నిజాం ప్రభువుల నుండి బలవంతంగా స్వాతంత్ర్యం పొందన రోజని అర్ధమొస్తుంది. అందుకనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం చెబుతున్నారు. అయితే ఇదే విషయాన్ని ఏడాదికి ఒకసారి బీజేపీ డిమాండ్ మొదలుపెట్టింది. సెప్టెంబర్ వస్తోందంటే చాలు బీజేపీకి వెంటనే తెలంగాణా విమోచనదినోత్సం గుర్తుకొస్తుంది. ఎలాగూ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ డిమాండ్ ను మరింతగా పెంచింది. తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా విమోచన దినోత్సవం జరపకపోతే కేంద్రప్రభుత్వమే అధికారికంగా జరుపుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.



కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని జరపేందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. హైదరాబాద్ కు వచ్చి కేంద్ర హోంశాఖ తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపితే మరి కేసీయార్ ఏం చేస్తారు ? చూస్తూ కూర్చోలేరు కదా అందుకనే ఆ క్రెడిట్ ఏదో తామే కొట్టేయాలని శనివారం జరిగిన క్యాబినెట్ భేటీలో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని మూడురోజులు ఘనంగా జరిపించాలని అర్జంటుగా తీర్మానం చేశారు. కాకపోతే దానికి జాతీయ సమైక్యతా దినోత్సవమని చెప్పారంతే.  మొత్తానికి బీజేపీ ట్రాపులో కేసీయార్ పడిపోయినట్లే అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: