నిజంగా ఇండియా గ్రేట్.. శత్రుదేశం పాకిస్థాన్ కి కూడా సహాయం?

praveen
శత్రువైన సరే అపాయం వచ్చినప్పుడు అభయహస్తం అందించాల్సిందే  అన్న డైలాగులు సినిమాలో ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. ఇక ఇలాంటి డైలాగులకూ సరిపడా పనులు నేటి రోజుల్లో మనుషులు ఎవరు  చేయటం లేదు అని చెప్పాలి. శత్రువులకు కష్ట సమయాల్లో సహాయం చేయడం అటుంచితే ఏకంగా మిత్రులకు కూడా కష్ట సమయాల్లో సహాయం చేయడానికి వెనుక ముందు ఆలోచిస్తూ ఉంటారు. కానీ   మనుషులు మాత్రమే కాదు ఆయా దేశాల ప్రభుత్వాలు ఇదే ధోరణి తో ఉన్నాయి. నేటి రోజుల్లో భారత్ మాత్రం శత్రువులకు కూడా సహాయం చేసేందుకు ముందుకు వస్తూ ఉండటం గమనార్హం.  మొన్నటి వరకు భారత్ పై  విమర్శలు చేసింది శ్రీలంక.  చైనా మాయలో పడిపోయి ఇష్టమొచ్చినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చింది.  కానీ శ్రీలంక కష్టాల్లో ఉన్న సమయంలో స్నేహితుడు అనుకున్న చైనా  ముఖం చాటేస్తే ఇక కావలసిన ఆహార ధాన్యాలను ఇంధన  నిలువలను కూడా సహాయం చేసి భారత్ గొప్ప మనసు చాటుకుంది.

 ఇక ఇప్పుడు పాకిస్థాన్ విషయంలో కూడా భారత ఇలాంటి పని చేయడానికి సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. పాకిస్తాన్ లో వరదలు బీభత్సం  సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వరదల కారణంగా 1000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. భారీ వరదల కారణంగా ఇక అక్కడ ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఇక తమ శత్రుదేశం అయినప్పటికీ పాకిస్థాన్కు సహాయం అందించేందుకు భారత సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్కు ఆహారధాన్యాల పంపించడంతో ఇటీవల కేంద్రం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఆహా ఇక దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమట.  అయితే పాకిస్థాన్కు భారత్ సహాయం చేయడం ఇది మొదటిసారి కాదు. 2005లో భారీ భూకంపం సంభవించినప్పుడు 2010లో వరదలు వచ్చినప్పుడు కూడా భారత్ ఆపన్న హస్తం అందించింది.  అంతేకాదు ఇటీవలే పాకిస్తాన్ లో భారీ వర్షాలకు బలైన వారి కుటుంబాలకు కూడా ప్రధాని మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. కష్ట  కాలం నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను తెలిపారు.  ఇప్పటికే ద్రవ్యోల్బణం తాలూకు దుష్పరిణామాలు ఉండగా.. ఇప్పుడు వరదలు  పాకిస్థాన్ ను  మరింత దుస్థితిలోకి నెట్టాయి అని చెప్పాలి. ఈ విషయం తెలిసి భారత్ నిజంగా ఎంతో గొప్ప దేశం అంటూ గర్వపడుతున్నారు  ఇండియన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: