వైఎస్ షర్మిల భవిష్యత్తు తెలిసిపోయిందా ?

VAMSI
తెలంగాణాలో రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకుల దృష్టి అంతా కూడా మునుగోడు ఎమ్మెల్యే ఉప ఎన్నిక మీదనే నెలకొంది. రీసెంటుగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గా గెలిచిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వివిధ కారణాలతో జాతీయ పార్టీ అయిన బీజేపీ లోకి వెళ్లిపోయారు. దీనితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదిలా ఉంటే... తెలంగాణాలో ఇప్పటికే అధికార పార్టీ తెరాస, కాంగ్రెస్ మరియు బీజేపీ లు వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం పోట్లాడుకుంటుంటే రాజన్న రాజ్యం తీసుకు వస్తానని గత కొద్ది కాలం క్రితం ఏపీ నుండి దివంగత నాయకుడు మరియు ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల... తెలంగాణ వైస్సార్ పార్టీని స్థాపించింది. అయితే ఈమె ఈ పార్టీపై చాలా నమ్మకం పెట్టుకుంది.
ప్రజలు ఇంకా వైఎస్సార్ ను మదిలో ఉంచుకుని ఆ ప్రేమను ఓట్ల రూపంలో తనకు వేస్తారని కలలు కన్నది. కానీ అనుకున్నది ఒకటి జరుగుతోంది మరొకటి షర్మిలను ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. ఎందుకంటే ఈమె రోజూ ఏదో ఒక పార్టీపై విమర్శలు చేస్తున్నా ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. షర్మిలను అస్సలు తమ రాజకీయ ప్రత్యర్థిగా ఒప్పుకోవడం లేదంటే నమ్మండి. కాగా మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తన పార్టీ అక్కడ పోటీ చేస్తుందా లేదా ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తుందా అన్నది ఏ విషయం స్పష్టత ఇవ్వలేదు.
దీనిని బట్టి తెలంగాణాలో తన భవిష్యత్తు ఏమిటో షర్మిలకు అర్ధం అయింది. అందుకే సైలెంట్ అయిపోయింది అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రస్తుతం అయితే షర్మిల పాదయాత్రలో ఉంది. దీనిలో కూడా పెద్ద రెస్పాన్స్ వచ్చినట్లు తెలియడం లేదు. కానీ మళ్ళీ షర్మిల బౌన్స్ బ్యాక్ అయ్యి తన వాణిని బలంగా వినిపిస్తుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: