హైదరాబాద్ : మూడు పార్టీలు సేమ్ టు సేమేనా ?

Vijaya






మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామాతో  అసెంబ్లీ ఉపఎన్నిక జరిగే అవకాశముంది. అదెప్పుడనేది ప్రస్తుతానికైతే సస్పెన్సనే చెప్పాలి. బహుశా వచ్చే డిసెంబర్లో జరగబోతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ జనరల్ ఎన్నికలతో కలిసి మునుగోడు ఉపఎన్నిక జరిగే అవకాశముంది. అప్పటివరకు జనాలు ఈ రాజకీయ కాలుష్యాన్ని భరించాల్సిందే తప్ప వేరేదారిలేదు. సరి ఉపఎన్నిక ఖాయమే అనుకుంటే మరి మూడుపార్టీల పరిస్ధితులు ఎలాగున్నాయి ?




ఇపుడిదే చర్చ పెద్దఎత్తున జరుగుతోంది. తామే గెలుస్తామని బీజేపీ చీఫ్ బండి సంజయ్, కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలను తీసేద్దాం. ఎందుకంటే వాళ్ళు అలాగే చెప్పుకోవాలి కాబట్టి అలాగే చెప్పుకుంటారు. మరి క్షేత్రస్ధాయిలో వాస్తవపరిస్దితులు ఎలాగున్నాయి. ఎలాగున్నాయంటే మూడుపార్టీలకు ప్లస్సులు, మైనస్సులున్నాయన్నది వాస్తవం. మొదట బీజేపీని తీసుకుంటే ఇక్కడ ప్రత్యేకంగా బీజేపీకి ఉన్న బలమేమీ లేదు. రాజగోపాల్ పార్టీలో చేరి అభ్యర్ధి అయితే ఆయన బలమే పార్టీబలం.



ఇప్పటికైతే రాజగోపాల్ తో పాటు పార్టీకి రాజీనామా చేసిన మద్దతుదారులు పెద్దగా లేరు. పైగా రాజగోపాల్ రాజీనామాచేసినా తాము కాంగ్రెస్ లోనే ఉంటామని ఎక్కువమంది చెప్పటం ఎంఎల్ఏకి మైనస్సే. ఇదే సమయంలో ఆర్ధిక, అంగబలాలు పుష్కలంగా ఉండటం రాజగోపాల్ కు పెద్ద ప్లస్సనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ పరిస్ధితి చూస్తే పార్టీపరంగా మంచి బలముంది. అయితే ఇంతకాలం బలమైన అభ్యర్ధిగా ఉన్న రాజగోపాల్ పార్టీకి రాజీనామా చేయటం పెద్ద మైనస్సే. నియోజకవర్గంలో గ్రామస్ధాయిలో కూడా గట్టి కార్యకర్తలుండటం ప్లస్సే. ఇదే సమయంలో పార్టీ గెలుపుకు ఎంతమంది నేతలు సహకరిస్తారో తెలీదు.



చివరకు కేసీయార్ విషయానికి వస్తే అధికారంలో ఉండటమొకటే ప్లస్సు. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం, నేతల్లో నాలుగు గ్రూపులుండటం పెద్ద మైనస్. అధికారంలో ఉన్నప్పటికీ దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. సో క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే మూడు ప్రధాన పార్టీలకు మైనస్సులు, ప్లస్సులున్నాయని అర్ధమవుతోంది. మరి జనాల మద్దతు ఎవరికుంటుందనే విషయం ఆసక్తిగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: