హైదరాబాద్ : కేసీయార్ ఇంతగా భయపడ్డారా ?

Vijaya

కేసీయార్ చాలా భయపడినట్లే ఉన్నారు. మునుగోడు బహిరంగసభలో సుమారు 15 నిముషాలు మాట్లాడారు. మామూలుగా అయితే మైక్ దొరికితే కేసీయార్ తొందరగా వదిలిపెట్టరని అందరికీ తెలిసిందే. అలాంటి మునుగోడు ఉఫఎన్నికకు సంబంధించిన పార్టీ ఆధ్వర్యంలో జరుగిన మొదటి బహిరంగసభ ఇది. అందులోను నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ మునుగోడులోనే సభ జరిగింది. ఈ సభలోనే అభ్యర్ధిని ప్రకటిస్తారని మీడియాలో ప్రచారం జరిగింది. పార్టీ నేతలు చెప్పిన ప్రకారమే మీడియా వార్తలు ఇచ్చింది.అయితే కేవలం పావుగంట మాత్రమే మాట్లాడిన కేసీయార్ చివరకు అభ్యర్ధిని ప్రకటించకుండానే తన ప్రసంగాన్ని ముగించేశారు. సీపీఐ మద్దతు ప్రకటించినా కూడా కేసీయార్ అభ్యర్ధిని ప్రకటించటానికి భయపడ్డారని అర్ధమైపోతోంది. కేసీయార్ ప్రకటించబోయే అభ్యర్ధి ఎవరాని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎందుకింత ఆసక్తంటే పార్టీలో అభ్యర్ధి విషయంలో రచ్చరచ్చయిపోతోంది. కేసీయార్ అయితే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని పోటీచేయించాలని డిసైడ్ అయిపోయారు. అయితే నియోజకవర్గంలోని నేతల్లో అత్యధికులు కూసుకుంట్లను వ్యతిరేకించారు. కూసుకుంట్లయితే తాము పనిచేసేదిలేదని స్వయంగా కేసీయార్ కే తెగేసి చెప్పేశారు.తన ఛాయిస్ కు వ్యతిరేకంగా వేరే నేతను అభ్యర్ధిగా ఎంపికచేయటాన్ని బహుశా కేసీయార్ ప్రిస్టేజ్ గా తీసుకున్నట్లున్నారు. అందుకనే నేతలను ఎలాగైనా ఒప్పించాలని మంత్రి జగదీశ్ రెడ్డిపై కేసీయార్ బాగా ఒత్తిడి పెడుతున్నారు. కేసీయార్ మాటనే కాదన్న నేతలు మంత్రిమాట వింటారా ?  అయితే కూసుకుంట్లను అంగీకరించాల్సిందిగా ఒత్తిళ్ళు పెరిగిపోతుండటంతో కొందరు నేతలు ఇఫ్పటికే బీజేపీలో చేరిపోయారు. ఇంకా కొందరు అదేపని చేయబోతున్నట్లు సమాచారం. ఆదివారం జరగబోయే బీజేపీ బహిరంగసభలో కమలంపార్టీలో చేరబోయే కారుపార్టీ నేతలెవరో తేలిపోతుంది.ఈ విషయంలోనే కేసీయార్ లో టెన్షన్ బాగా పెరిగిపోతున్నట్లుంది. తానుగనుక అభ్యర్ధిని ప్రకటించేస్తే ఉపఎన్నిక నాటికి పార్టీలో గట్టి నేతలే ఉండరని భయపడినట్లున్నారు. అందుకనే వీలైనంతలో అభ్యర్ధిని ప్రకటించకుండా వాయిదా వేసుకోవాలని డిసైడ్ అయినట్లున్నారు. అయితే కేసీయార్ ఒక్కళ్ళే కాదు తెలివిపరులు. కేసీయార్ ఆలోచన గమనించిన నేతలు ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు. మొత్తానికి కేసీయార్ దెబ్బకు మునుగోడులో పార్టీ అంతా ఖాళీ అయిపోతుందనే సందేహాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: