హైదరాబాద్: షాకింగ్.. ఆగిపోనున్న వాటర్?

Purushottham Vinay
హైదరాబాద్ లో ఆగస్టు 16న ఉదయం ఆరు గంటల నుంచి నీటి సరఫరా ఆగిపోతుంది. ఇక దీంతో సదరు కాలనీల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెబుతున్నారు. 36 గంటల పాటు నీటి సరఫరా అనేది నిలిచిపోనుంది.నగరంలోని దాదాపు 3.5 లక్షల మందికి ఈ మంచినీటి సరఫరా అందకుండా పోనుంది. దీంతో ఫలక్ నుమా ప్రాంతంలోని అల్ జుబైల్ కాలనీలో జరుగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణం కారణంగా మీరాలం అలియాబాద్ పైప్ లైన్స్ షట్ డౌన్ తో తాగునీటి సరఫరా ఆగనుందని సమాచారం తెలుస్తోంది. అలాగే నగరంలో తాగునీరు సరఫరా ఆగిపోయే ప్రాంతాల్లో మీరాలం, కిషన్ బాగ్, అల్ జుబైల్ కాలనీ, సంతోష్ నగర్, వినయ్ సాగర్ ఇంకా సైదాబాద్, చంచల్ గూడ, అస్మాన్ గడ్, యకుత్ పురా, మాదన్నపేట, మహబూబ్ మేన్షన్, రియసత్ నగర్, అలియాబాద్, బాలాపూర్, బొగ్గులకుంట ఇంకా అఫ్జల్ గంజ్, నారాయణ గూడ, ఆడిక్ మెట్, శివమ్, నల్లకుంట, చిలకలగూడ, దిల్ సుఖ్ నగర్, బొంగుళూరు, మన్నెగూడ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలచిపోనుంది.


ఇంకా అలాగే నగరంలోని పాక్షికంగా నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాల్లో మెహదీపట్నం, కార్వాన్, లంగర్ హౌస్, కాకతీయనగర్, హనుమాన్ నగర్, తల్లగడ్డ, ఆసిఫ్ నగర్, ఎంఈఎస్, షేక్ పేట్, ఓయూ కాలనీ, టోలీచౌకీ, మల్లేపల్లి, విజయనగర్ కాలనీ, భోజగుట్ట ఇంకా చింతల్ బస్తీ, ఆళ్లబండ, జియాగూడ, రెడిహిల్స్, సెక్రె టెరియేట్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, గగన్ మహల్, హిమాయత్ సాగర్, బద్వేల్, హైదర్ గూడ, రాజేంద్రనగర్, ఉప్పరపల్లి, సులేమాన్ నగర్ ఇంకా ఎంఎం పహాడి, చింతల్ మెట్, కిషన్ బాగ్, మణికొండ, గంధంగూడ, నార్మింగ్, కిస్మత్ పుర, బాలాపూర్ ఇంకా మైసారం, బండ్లగూడ, బర్కాస్, మేకలమండి, భోరక్ పూర్, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూం, రైల్వేస్, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగూడ, హన్మత్ పేట, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, తాటిఖానా, లాలాపేట్, సాహెబ్ నగర్ అలాగే ఆటోనగర్, సరూర్ నగర్, వాసవి, సైనిక్ పురి, మౌలాలి, స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్ర నగర్, గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, మధుబన్, దుర్గానగర్, సులేమానగర్, గోల్డెన్ హైట్స్, మల్లికార్జున నగర్, మానిక్ చంద్, చెంగిచర్ల, భరత్ నగర్, పీర్జాదిగూడ, కిస్మత్ పూర్, ధర్మశాయి ఇంకా అలాగే కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఆగనుందని ప్రకటిస్తోంది.


హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఆగిపోవడంతో కలిగే ఇబ్బందులను తొలగించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.ప్రజలకు కలుగుతున్న అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని అధికారులు చెబుతున్నారు. నీటిని పొదుపుగా వాడుకుని నీటి కష్టాలను అధిగమించాలని వారు సూచిస్తున్నారు.ఈ 36 గంటల పాటు జరిగే నీటి సరఫరా ఇబ్బందులను తొలగించుకునే క్రమంలో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: