ఉప ఎన్నిక: "మునుగోడు"లో గెలిచే మొనగాడెవడు ?
అయితే ఈయన రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. దీనితో మళ్ళీ అన్ని పార్టీలు అక్కడ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. అయితే కాంగ్రెస్ తరపున గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక వార్త మాత్రం వెలువడలేదు. ఇక ఎప్పటిలాగే ఈ ఉప ఎన్నికలో కూడా ప్రధానంగా పోటీలో కాంగ్రెస్ , తెరాస మరియు బీజేపీలు ఉండే అవకాశం ఉంది. కానీ ప్రజావాణి ప్రకారం తెరాస కు ఈ సీట్ దక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పటి నుండి ఇప్పటి వరకు తానేమిటో నిరూపించుకోలేదు.
అందుకే ఈ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరి మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా గెలిచే మొనగాడు ఎవరో తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే.