సిగ్గుచేటు: మద్యం తాగి స్కూల్ కి వచ్చిన లేడీ టీచర్!

Purushottham Vinay
ఇక ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడు అని మన జాతిపిత మహాత్మగాంధీ చెప్పారు. మనం చెప్పే స్థానంలో ఉన్నామంటే ఖచ్చితంగా మనం ఆచరించి చూపించాలి.అప్పుడే ఇక దాన్ని ఇతరులు కూడా అనుసరిస్తారు. సార్థకత వస్తుంది. సమాజ గతిని మార్చేది కూడా ఉపాధ్యాయులే. విద్యార్థులను మంచి దారిలో నడిపించి భావిభారత పౌరులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. కానీ వారే గతి తప్పితే ఇంకా వారే నీచమైన పనికి ఒడిగడితే.ఇక కంచే చేను మేస్తే ఇంకేముంది. విద్యార్థులను సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన గురువులే చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు.ఇక విద్యార్థుల పట్ల ఎంతో గురుతర బాధ్యతలు ఉన్నా వారి ప్రవర్తన అనేది అసహ్యంగా ఉండటంతో వారి స్థానం కూడా మారుతోంది. విద్యార్థులు కూడా వారినిఅసలు గౌరవించడం లేదు. కొన్ని చోట్ల విద్యార్థులపై అత్యాచారాలు చేస్తుంటే మరికొన్ని చోట్ల గురువులు తాగి వస్తూ తమ స్థాయిని తగ్గించుకుంటున్నారు. విద్యార్థుల్లో చాలా చులకన అవుతున్నారు.


వారి వ్యక్తిగత సమస్యలు కూడా మనకు అనవసరం. ఉపాధ్యాయులుగా ఉండాలంటే ఉత్తమమైన మార్గంలో ఖచ్చితంగా నడవాల్సిందే. ఇక విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పేవారు సక్రమమైన మార్గంలోనే నడవాలి.ఇక తాజాగా చత్తీస్ గడ్ లోని జైపూర్ లో ఓ సంఘటన అనేది జరిగింది. సాక్షాత్తూ జిల్లా విద్యాధికారి ఎదుటే ఓ మహిళా ఉపాధ్యాయురాలు తాగి పడుకున్న ఘటన పెద్ద ఆందోళన కలిగిస్తోంది. ఉపాధ్యాయులకే ఆమె మచ్చ తెస్తోంది. సదరు డీఈవో ఏదో ఆరోగ్యం బాగాలేకపోవడంతో పడుకుందని అనుకున్నా కూడా విద్యార్థులను ఆరా తీస్తే ఈ అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువులకే కళంకం తెచ్చే ఇలాంటి వారు ఉండటం నిజంగా సమాజానికి సిగ్గు చేటు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచరే ఇలా పాడు పని చేస్తే వారి భవిష్యత్ ఏమిటి?ఇక వారు కూడా అదే బాటలో నడవరని నమ్మకం ఏంటి?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: