హైదరాబాద్ : మద్యలో ఇరుక్కోబోతున్న షర్మిల

Vijaya

తెలుగురాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం చివరకు రాజకీయంగా కీలకమలుపు తీసుకోనున్నది. ఈ రాజకీయంలో వివిధ పార్టీల స్టాండ్ పై క్లారిటి ఉండగా కేవలం వైఎస్సార్టీపీకి మాత్రం ఇబ్బందులు మొదలయ్యేట్లుంది. ఈ ఇబ్బంది వల్ల పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇరుక్కోబోతున్నారా ? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే పలు సందర్భాల్లో తాను తెలంగాణా బిడ్డనే అని షర్మిల ప్రకటించుకున్నారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తినపుడు ఏమి చేస్తారో చెప్పలేదు.మిగిలిన పార్టీలకు లేని ఇబ్బంది షర్మిలకే వస్తుంది. ఎందుకంటే తెలంగాణాలోని మిగిలిన పార్టీలన్నీ కేవలం తెలంగాణా ప్రయోజనాల కోణంలోనే చూస్తాయి. వివాదంలో తెలంగాణా వాదన తప్పయినా సరే పార్టీలు మాత్రమే తెలంగాణాకే మద్దతుగా నిలుస్తాయి. అయితే ఇక్కడ షర్మిల సమస్య ఏమిటంటే పుట్టిన ఏపీకి అన్యాయం చేయలేరు, అలాగని పార్టీ పెట్టుకుని రాజకీయం చేస్తున్న తెలంగాణానూ సపోర్టు చేయలేరు. ఇందులో ఎవరికి మద్దతుగా నిలబడినా రెండోవాళ్ళకి మండటం ఖాయం.ఇప్పుడింతకీ విషయం ఏమిటంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాచలం ప్రాంతం ముంపుకు గురవుతుందని మంత్రులు గోలచేస్తున్నారు. ఈగోల చాలా కాలంగానే ఉంది. అయితే తాజాగా ప్రాజెక్టు దెబ్బతినకుండా ముందు కాఫర్ డ్యాం ఎత్తును కూడా పెంచాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ చేసింది. డిసైడ్ చేయటమే కాదు ఏకంగా పనులు కూడా స్పీడుగా చేయించేస్తోంది. 41 అడుగుల డ్యాం ఎత్తును 43 అడుగులకు పెంచుతున్నారు. దీనివల్ల వరద ప్రవాహం ఎంతొచ్చినా పోలవరం ప్రాజెక్టు సేఫ్ గానే ఉంటుంది.
ఇపుడొచ్చిన 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం భవిష్యత్తులో 50 లక్షల క్యూసెక్కులు వచ్చినా తట్టుకునేట్లుగా గోడ ఎత్తు పెంచుతున్నారు. దీన్ని ఖమ్మంజిల్లాలోని మంత్రి, ఎంఎల్ఏలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిపుణుల అభిప్రాయం ప్రకారం తీసుకున్నదే. అయినా మంత్రి, ఎంఎల్ఏలు వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశం ముందుముందు మరింత రాజుకోబోతోంది. మరప్పుడు షర్మిల ఏమి స్టాండ్ తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: