గోదావరి : పవన్ నియోజకవర్గం ఫిక్సయ్యిందా ?

Vijaya






వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆశలతోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్  పిఠాపురం నియోజకవర్గంలో సర్వేల మీద సర్వేలు చేయించుకుంటున్నారట. అంటే జరిగిన, జరుగుతున్న సర్వేలన్నీ పవనే చేయించుకుంటున్నట్లు కాదు. పవన్ కు మద్దతుగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా తమంతట తాముగానే సర్వేలు చేస్తు నియోజకవర్గంలోని జనాల అభిప్రాయాలు తీసుకుంటున్నాయి.




సో జరుగుతున్న తంతు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుండి పోటీచేసేందుకు రెడీ అవుతున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మొదట్లో కాకినాడ రూరల్ అన్నారు. తర్వాత కాదు కాదు కాకినాడే అన్నారు. మళ్ళీ పోయిన చోటే వెతుక్కోవాలన్న నానుడిని నిజంచేస్తు మళ్ళీ భీమవరం కానీ గాజువాక నుండే పోటీచేస్తాడన్నారు. చివరకు భీమిలీ నుండే పోటీచేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈమధ్యనే తిరుపతి నుండి పోటీచేస్తే లక్ష ఓట్ల మెజారిటితో గెలిపిస్తామని అక్కడి నేతలంటే దానిపైన కూడా సర్వే చేయించుకున్నారు.




ఇలాంటి ప్రచారాలు, చర్చలు జరుగుతుండగానే సడెన్ గా పిఠాపురం వ్యవహారం తెరపైకి వచ్చింది. సర్వే చేసే సందర్భంగానే జనాలు మొన్నటి ఎన్నికల్లోనే పిఠాపురం నుండి పోటీచేసుంటే పవన్ గెలిచుండేవారని అన్నారట. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఎంఎల్ఏ పెండెం దొరబాబు టీడీపీ అభ్యర్ధి వర్మపై సుమారు 15 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పటి ఎన్నికల్లో జనసేన నుండి పోటీచేసిన శేషుకుమారికి 28 వేల ఓట్లొచ్చాయి. అంటే ట్రయాంగిల్ ఫైట్లో కూడా జనసేనకు 28 వేల ఓట్లొచ్చాయంటే చిన్న విషయంకాదు.




ఇలాంటి లెక్కలు చాలా వేసుకునే వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుండే పవన్ పోటీచేయబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను ఎక్కడినుండి పోటీచేయబోయేది పవన్ ఇప్పటివరకు చెప్పలేదు. ఇందుకనే అనేక నియోజకవర్గాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.  కాకపోతే ఇప్పటివరకు ప్రచారం జరిగిన నియోజకవర్గాలకు ఇపుడు పిఠాపురం విషయంలో జరుగుతున్న ప్రచారానికి తేడా ఉంది కాబట్టి పవన్ పోటీ ఇక్కడి నుండే అని అనుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: