అమరావతి : భారతి కోసం ఇంత తతంగం అవసరమా ?

Vijaya

హేమిటో ఎల్లోమీడియా, తెలుగుదేశంపార్టీ నేతల వాదన చాలా విచిత్రంగా ఉంది. రెండు రోజుల ప్లీనరీ నిర్వహణే దండగమని చంద్రబాబునాయుడు తేల్చేశారు. ఏం ఉద్దరించారని వైసీపీ ప్లీనరీ పెట్టుకుందని చంద్రబాబు అడగటమే విచిత్రంగా ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళ ప్లీనరీ వాళ్ళిష్టం. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశంపార్టీ ఏమి ఉద్దరించిందని మహానాడు, మినీ మహానాడులు పెట్టుకుంటోంది ? అని అడిగితే చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారు  ?
ఇక రెండోపాయింట్ ఏమిటంటే విజయమ్మను గౌరవాధ్యక్షురాలిగా సాగనంపేందుకే ఈ ప్లీనరీని నిర్వహించారట. విజయమ్మను గౌరవాధ్యక్షురాలిగా సాగనంపాలంటే ప్లీనరీ నిర్వహించాలా ? ఇంట్లో కూర్చున్నపుడు గౌరవాద్యక్షురాలిగా రాజీనామా చేయమని జగన్ అడిగితే విజయమ్మ చేయనంటారా ? అసలు వైసీపీ జగనే ముఖ్యంకానీ విజయమ్మ కాదుకదా. విజయమ్మతో ఎందుకు రాజీనామా చేయించారు ? ఎందుకంటే భార్య భారతి కోసమేనట.
భారతి కోసం విజయమ్మతో ఎందుకు రాజీనామా చేయించాలి ? ఎందుకంటే సీబీఐ జగన్ను జైలులో పెడితే సీఎం కుర్చీలో భార్య భారతిని కూర్చోబెట్టాలన్నది జగన్ ఆలోచనట. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎల్లోమీడియాలో ఇప్పటికి ఎన్నిసార్లు జైలుకు పంపిందో లెక్కేలేదు. అయినా సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలన్నది పూర్తిగా జగన్ ఇష్టం. జగన్ ఎవరిని కూర్చోమంటే వాళ్ళే కూర్చుంటారనటంలో అనుమానమే లేదు. ఇదే విషయం అమ్మకైనా, భార్య భారతయినా ఇదే వర్తిస్తుంది.
ఇంతోటిదానికి తల్లితో గౌరవాధ్యక్షురాలిగా రాజీనామా చేయించాల్సిన అవసరమే లేదు. కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఎవరికైనా ఈ విషయం అర్ధమైపోతుంది. ఇక్కడ విజయమ్మ ముందున్న సమస్య ఏమిటంటే కొడుకు ఏపీ ముఖ్యమంత్రిగా, కూతురు షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టుకుని తిరుగుతుంటే రెండు రాష్ట్రాల మధ్య తిరగటం, జనాలతో మాట్లాడేటపుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైగా కూతురు కష్టపడుతుంటే తోడుగా ఉండాలని అనుకున్నట్లు ఆమే స్వయంగా చెప్పారు. దీనికి విపరీతార్ధాలుతీసి జగన్ పై బురద చల్లటానికి మాత్రమే ఈ రాతల పనికొస్తాయంతే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: