ఉత్తరాంధ్ర : ఈయనకు ఏమైంది ? ఎందుకిలా మాట్లాడుతున్నారు ?

Vijayaఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు ఏమైందో అర్ధం కావటంలేదు. ఉత్తరాంధ్రపర్యటనలో ఉన్న చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడేస్తున్నారు. జనాలను చూసేటప్పటికి నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. ఈ ఊపులో తానేం మాట్లాడుతున్నారు ? ఏమి మాట్లాడకూడదనే విచక్షణ కూడా కోల్పోయినట్లు అర్ధమైపోతోంది. అందుకనే చంద్రబాబు డైలాగులపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వట్టర్ వేదికగా విపరీతమైన పంచులేస్తున్నారు.మచ్చుకి చంద్రబాబు మాట్లాడిన మాటలను కొన్నింటిని ఇస్తున్నాం. ‘నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి’ అని తమ్ముళ్ళని అడిగారు. చంద్రబాబు ప్రశ్న వినగానే తమ్ముళ్ళకు కళ్ళు బైర్లు కమ్మాయి. కరోనా వైరస్ రావటానికి చంద్రబాబు అధికారంలో లేకపోవటానికి సంబంధం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. కరోనా వైరస్ వచ్చిందనే కదా భయపడి కరకట్ట నుండి వెళ్ళిపోయి హైదరాబాద్ లోని తనింట్లో నెలలపాటు ఎక్కడికి కదలకుండా, ఎవరినీ కలవకుండా కూర్చున్నది.వెంకటేశ్వరస్వామి తనపై 24 క్లెమోర్ మైన్స్ పేల్చినా తనకేమీ కాలేదట. వెంకటేశ్వరస్వామి ఏమిటి చంద్రబాబుపై క్లెమోర్ మైన్స్ పేల్చటమేమిటి ? 2003లో క్లెమోర్ మైన్స్ పేల్చింది మావోయిస్టులు కదా. వెంకటేశ్వరస్వామి దయవల్లే తాను మావోయిస్టుల దాడినుండి క్షేమంగా బయటపడ్డానని కొన్ని వందలసార్లు చెప్పుంటారు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా వెంకటేశ్వరస్వామే తనపై క్లెమోర్ మైన్స్ పేల్చారనటం హేమిటో.ఉత్తరాంధ్రలో పెత్తనం చేయటానికి విజయసాయిరెడ్డి ఎవరు వైవీ సుబ్బారెడ్డి ఎవరు ? అంటు పదే పదే ప్రశ్నిస్తున్నారు. వాళ్ళిద్దరు అధికారపార్టీ నేతలు, ఉత్తరాంధ్ర ఇన్చార్జిలు. ప్రతిపార్టీ కూడా కొన్ని జిల్లాలకు పార్టీల తరపున ఇన్చార్జిలను నియమించుకోవటం మామూలే కదా. ఇపుడు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు టీడీపీ తరపున మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న ఇన్చార్జిగా ఉన్నారు కదా. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబే పార్టీ తరపున ఇన్చార్జిని పెట్టినట్లే  అధికారపార్టీ కూడా ఇన్చార్జిని పెట్టుకోవటంలో తప్పేముంది ?
ఇక చివరగా ప్రభుత్వం ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజూస్ తో ఒప్పందం చేసుకోవటాన్ని కూడా చంద్రబాబు సహించలేకపోయారు. అదేదో బైజూస్ అట తానెప్పుడూ వినలేదని అంటూనే అది బైజూస్ కాదు జగన్ జ్యూస్ అంటు హేళనగా మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే జగన్ అంటేనే చంద్రబాబుకు ఎంతటి మంటపుడుతోందో అర్ధమైపోతోంది. ఇదికాకుండా అధికారంలో ఉన్నపుడు మాట్లాడిన ఆణిముత్యాలను చెప్పాలంటే చేంతాడంతుంది. ఇంకోసారి చెప్పుకుందాంలేండి.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: