కరోనా కోరల్లో చిక్కుకున్న అగ్రరాజ్యం.. మరో భీభత్సం తప్పదా?

VAMSI
అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా విలయ తాండవం అస్సలు తగ్గడం లేదు. ఇదిలా ఉంటే ఇపుడు తీవ్రత మరింత పెరుగుతోంది. వ్యాప్తి రోజుకీ రోజుకి పెరుగుతూ ఉంది. మళ్ళీ కరోనా ముప్పు తప్పేలా లేదని నిపుణులు చెబుతున్నారు. వైరస్ లో తీవ్రత పెరుగుతోందని వారు అంటున్నారు. అందరూ టీకాలు వేసుకోవడం మంచిదని చెబుతున్నారు. అమెరికాలో గత కొద్ది రోజులుగా కరోనా విజృంభిస్తోంది. నిత్యం వేలల్లో కేసులు నమోదు అవుతుండటం తో అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నమోదు అవుతున్న కేసుల
వివరాలు చూస్తే... నిన్న గడిచిన 24 గంటల్లో మంగళవారం నాడు అమెరికాలో  72,312 కొత్త కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.
అదే విధంగా నిన్న ఒక్క రోజే  279 కరోనా తో మరణించారు.  అమెరికాలో ఇలా రోజురోజుకీ కరోనా ప్రళయం పెరుగుతుందని నిపుణులు చెబుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు.  మరో వైపు ఇతర దేశాలలోను కరోనా ఉదృతి కొనసాగుతుంది.  తైవాన్, ఫ్రాన్స్, బ్రెజిల్, జర్మనీ వంటి దేశాల్లో కూడా కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మన భారత లోనూ కరోనా వేగం పుంజుకున్న విషయం విదితమే. ఇక ఇతర దేశాల విషయానికి వస్తే జర్మనీలో 83వేల కేసులు, ఫ్రాన్స్ లో కొత్త గా 65వేల కేసులు, బ్రెజిల్ లో 40వేల కొత్త కేసులు తైర్ముల్వాన్ లో 66వేల కేసులు, నమోదయ్యాయి.
భారత దేశం లో మంగళవారం నాడు దేశ వ్యాప్తంగా 8,822 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. 15 మంది కరోనా బాధితులు తమ ప్రాణాలు కోల్పోయారు. వీలయినంత త్వరగా అందరూ వ్యాక్సిన్ లు వేయించుకోవాలి అని అలాగే ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ ను తీసుకున్న వారు బూస్టర్ డోస్ లు కూడా వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.  పోను పోను కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరి పరిస్థితులు ఎపుడు ఎలా మారుతాయి అన్నది ఎవరు ఊహించలేం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: