వయస్సు 25 ఏళ్ళు.. 1850 కి. మీ నడక.. దేనికోసమో తెలిస్తే షాకే?

praveen
దృడమైన సంకల్పం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తూ ఉంటారు ఎంతో మంది. పట్టువిడవకుండా పోరాడితే ఎంత పెద్ద లక్ష్యం అయినా సరే ఆవగింజంత చిన్నగా కనిపిస్తుంది అని అంటూ ఉంటారు. ఇక్కడ ఓ యువకుడు ఇది నిజం చేసి చూపించాడు. పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అనే ఒక నినాదాన్ని తన మనసులో నింపుకున్నాడు. ఈ క్రమంలోనే గమ్యం చేరే వరకు విశ్రమించేది లేదు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని చేతులు కట్టుకుని కూర్చోకుండా తనవంతుగా సామాజిక సేవ చేయడానికి ముందుకొచ్చాడు. దీని కోసం ఏకంగా 18 వందల యాభై కిలోమీటర్ల ప్రయాణం చేసాడు.

 పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్ల ప్రయాణం చేయడం పెద్ద గొప్పేమీ కాదు కదా అని అనుకుంటున్నారు కదా. అతను 1850 కిలోమీటర్లు వెళ్ళింది కార్ లోనో బైక్ పైనో కాదు ఏకంగా కాలినడకన పట్టువీడని విక్రమార్కుడులా 1850 కిలోమీటర్లు నడిచాడూ. ఇంతకీ అతను ఇలా నడక సాగించడానికి వెనుక ఒక పెద్ద సంకల్పం దాగివుంది. రైతుల ఆత్మహత్యలు నీటి కొరత సమస్యలు ప్లాస్టిక్ వినియోగంపై చలించిన అతను  ప్రజలలో అవగాహన తీసుకురావాలని గ్రామ గ్రామానికి వెళ్లి గ్లోబల్ వార్మింగ్ పై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు.

 మహారాష్ట్రలోని రత్నగిరిలో నర్వావ గ్రామానికి చెందిన అషుతోష్ జోషి పాఠశాల విద్యను చుప్లూన్ లో పూర్తి చేసిన తర్వాత ముంబైలోని మోడల్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ లో చదువు కొనసాగించాడు. అయితే ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి ఫైన్ ఆర్ట్స్ లో విద్యను పూర్తిచేశాడు. చదువు ముగిశాక ఫొటోగ్రఫీ రంగాన్ని ఎంచుకుని పోలాండ్ స్పెయిన్ ఇంగ్లండులో పనిచేశాడు. భారత వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులను చూసి ఒక్క సారిగా చలించిపోయాడు. ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాడు. ఏప్రిల్ 10వ తేదీన తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మహారాష్ట్ర నర్వాన్  బీచ్ నుంచి మొదలుపెట్టి ఒరిస్సాలోని పరి వరకు 1850 కిలోమీటర్లు నడిచాడూ. అన్ని గ్రామాల్లోని సర్పంచులను కలిసి సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. దీనికోసం ఆరు ఏడు సంవత్సరాల నుంచి నడకను ప్రాక్టీస్ చేసాను.. ఆరు నెలలుగా ఈ పర్యటన కోసం నన్ను నేను సిద్ధం చేసుకున్నాను అంటూ చెబుతున్నారు ఆ యువకుడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: