"కోర్ట్ ను ధిక్కరించిన" తహశీల్ధార్ కు జైలు శిక్ష ?

VAMSI
విశాఖపట్నం జిల్లా గాజువాక తహసీల్దార్‌కు కోర్టులో చుక్కెదురు ఎదురయ్యింది. తహశీల్ధార్ న్యాయస్థానం 6 నెలల జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధించింది. 2వేల జరిమానాను అలాగే 6 నెలల జైలు శిక్షను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఉన్నత న్యాయస్థానం. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం లోని తూంగలం గ్రామ పంచాయతీ పరిధిలోని 29/1 సర్వే నెంబర్‌లో ఉన్ననటువంటి భూమిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని స్థానికులు తిరగబడ్డారు. ఈ క్రమంలో 2014లో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆధారాలను పరిగణలోకి తీసుకుని ఆ భూమి నుంచి వారిని ఖాళీ చేయించకూడదని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే ఒకవైపు కోర్టులో ఈ విషయంపై విచారణ జరుగుతుండగా మరో వైపు తహసీల్దార్ ఎంవీఎస్‌ లోకేశ్వరరావు మాత్రం ఆ స్థలంలో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చి వేయించారు. పైగా వారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అధికారుల మతలబుది కరిచారు అని ఆరోపణలు చేశారు. కాగా పిటిషనర్లు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అధికారులు, తహసీల్దార్‌ ను ప్రతివాదులుగా చేరుస్తూ ధిక్కార వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి సంచలన తీర్పును ఇచ్చారు.   తహసీల్దార్‌ చర్యలు ఉద్దేశ పూర్వక ఉత్తర్వుల ఉల్లంఘన కిందకే వస్తుందని న్యాయమూర్తి అభిప్రాయపడుతూ తుది నిర్ణయాన్ని వెల్లడించారు.
పిటిషనర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే వారి నుండి చట్ట బద్ధంగా స్వాధీన పరచుకోవాలి. కానీ ఇలా దౌర్జన్యం చేయకూడదని ప్రభుత్వ అధికారి అయి ఉండి రూల్స్ ను అతిక్రమించిన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తహసీల్దార్ ఈ నెల 18వ తేదీన కోర్టుకు హాజరు కావాలని, అనంతరం ఆయన్ను సివిల్‌ ప్రిజన్ కు తరలించాలని ఆదేశించారు . కోర్టు విధించిన జరిమానా చెల్లించని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాల్సిందిగా విశాఖ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: