రాయలసీమ : చంద్రబాబు మీద ప్రెషర్ పెరిగిపోతోందా ?

Vijaya



ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడుపై జగన్మోహన్ రెడ్డి ప్రెషర్ పెంచేస్తున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానం పెరిగిపోతోంది. చంద్రబాబులో ప్రెషర్ పెరిగిపోవటానికి మంత్రివర్గం ప్రమాణ స్వీకారమే కారణం. మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి చంద్రబాబుకు ఏమిటి సంబంధం ? సంబంధం ఏమిటంటే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆర్కే రోజా కూడా ఉండటమే.




చంద్రబాబుకు పెద్దిరెడ్డి, రోజాలతో ఏమాత్రం పడదన్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి మూడోమంత్రి నారాయణస్వామికి కూడా చంద్రబాబుతో పడదు. కానీ సమస్యల్లా పెద్దిరెడ్డి, రోజాతోనే వస్తుంది. ఎందుకంటే కుప్పంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించటమే ధ్యేయంగా పెద్దిరెడ్డి పనిచేస్తున్నారు. పెద్దిరెడ్డికి తాజాగా రోజా కూడా తోడయ్యారు. చంద్రబాబును పెద్దిరెడ్డి, రోజా చెరోవైపునుండి వెంటాడుతుంటారు. వీళ్ళద్దరు చంద్రబాబును డైరెక్టుగా ఎటాక్ చేస్తుంటారు.



వీళ్ళిద్దరిలో పెద్దిరెడ్డి ఎంత డేంజరో రోజా కూడా అంతే డేంజర్. విషయం ఏమిటంటే పెద్దిరెడ్డి కార్యసాధకుడు. చంద్రబాబును ఓడగొట్టడానికి ఏమేమి చేయాలో గ్రౌండ్ లెవల్లో పెద్దిరెడ్డి అదంతా ఎప్పటినుండో చేస్తున్నారు. దాని ఫలితమే స్ధానికసంస్ధల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవటం. ఇక రోజా విషయానికి వస్తే తనదైన పంచులతో, సెటైర్లతో చంద్రబాబు మీద విరుచుకుపడుతున్న విషయం అందరు చూస్తున్నదే. ఇలాంటి రోజాకు మంత్రిపదవి దక్కిందంటే చంద్రబాబుకు ఇబ్బందులనే చెప్పాలి. ఒకవైపు పెద్దిరెడ్డి మరోవైపు రోజాలు కుప్పాన్ని వదలకుండా పర్యటిస్తారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలును స్పీడు చేస్తారు.



అసలే పెద్దిరెడ్డన్నా రోజా అన్నా చంద్రబాబు అండ్ కో కు ఒళ్ళంతా కారం రాసుకున్నట్లుంటుంది. అలాంటిది ఇద్దరికీ ఒకేసారి మంత్రివర్గంలో చోటు దక్కటమంటే టీడీపీకి మింగుడుపడటంలేదు. పైగా కుప్పం కూడా చిత్తూరు జిల్లాలోనే ఉండటం చంద్రబాబుకు మరింత ఇబ్బందిగా మారింది. ఏదేమైనా చంద్రబాబుకు రాబోయే రెండేళ్ళు వీళ్ళని  తట్టుకోవటం కష్టమనే చెప్పాలి. మరీ వీళ్ళని తట్టుకునేందుకు చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: