అమెరికా సీరియస్.. భారత్ కౌంటర్?

praveen
గత కొంత కాలం నుంచి రష్యా ఉక్రెయిన్  మధ్య జరుగుతున్న యుద్ధం ఎంత హాట్ టాపిక్ గా మారిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రష్యా సేనలు ఉక్రెయిన్ పై విరుచుకు పడుతున్న నేపథ్యంలో  ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలోనే అటు అమెరికా యూరోపియన్ యూనియన్ నాటో దేశాలు ఉక్రెయిన్ కి అండగా నిలిచారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాపై అన్ని రకాల ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి.

 వాణిజ్య పరమైన అన్ని సంబంధాలను తెంచుకోవడంతో పాటు అటు ఆర్థిక ఆంక్షలు కూడా విధిస్తూ ఉన్నాయి. అయితే అటు భారత్ మాత్రం రష్యా పై ఎలాంటి ఆంక్షలు విధించడం లేదు. అదే సమయంలో ఇక ప్రస్తుతం అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా ఇచ్చిన ఆఫర్ లను వినియోగించుకుంటున్న భారత్  పలు దిగుమతులను కూడా చేసుకుంటుందని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ రష్యా యుద్ధం విషయంలో తటస్థ ధోరణి వ్యవహరించడంపై అటు అమెరికా మాత్రం గత కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది.

 ఈ క్రమంలోనే పలుమార్లు భారత్తో చర్చలు జరుపుతూనే ఉంది అమెరిక. ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ భారత రక్షణ శాఖ రాజ్ నాథ్ సింగ్ తో అటు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి,రక్షణ మంత్రిలు కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. భారత రష్యాతో సంబంధాలు తెంచుకోకపోతే ఆంక్షలు పెట్టక తప్పదు అని చర్చల్లో అమెరికా  విదేశాంగ శాఖ మంత్రి అన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్పందించిన భారత విదేశాంగ శాఖ మంత్రి ఒకవేళ ఆంక్షలు పెట్టాల్సి వస్తే ముందుగా యురోపియన్ యూనియన్  నాటో దేశాలపై పెట్టాలి అంటూ సమాధానం ఇచ్చింది. ఎందుకంటే అమెరికా రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ యూరోపియన్ యూనియన్ నాటో దేశాలు మాత్రం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి.. దీంతో భారత్ ఇలాంటి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: