హైదరాబాద్ : చాలా సైలెంటుగా దెబ్బకొట్టిన గవర్నర్ ?

Vijaya


ప్రోటోకాల్ వివాదం తెలంగాణాలో చాలా పెద్ద ఇష్యూగా మారిపోయింది. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పర్యవసానం ఏమిటో తొందరలోనే ఉన్నతాధికారులకు అర్ధమవ్వబోతోంది. ఎలాగంటే ప్రోటోకాల్ ఉల్లంఘనల విషయమై గవర్నర్ తమిళిసై ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు కాబట్టి. గవర్నర్ ఫిర్యాదు చేయటమంటే మామూలుగా ఉండదు.



తానే నియమించిన గవర్నరే ఫిర్యాదు చేసిన తర్వాత ప్రోటోకాల్ ఉల్లంఘనలకు బాధ్యులపై చర్చలు తీసుకోకపోతే కేంద్రం ఇజ్జత్ కే సవాలు. ఇంతకీ విషయం ఏమిటంటే తమిళిసై ఆమధ్య సమ్మక్క-సారక్క జాతర ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాలోని మేడారంకు చేరుకున్నారు. అయితే గవర్నర్ కు స్వాగతం పలికేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఎవరు కనబడలేదు. గవర్నర్ మేడారం చేరుకునేంతవరకు అక్కడే ఉన్న మంత్రులు, కలెక్టర్, ఎస్పీతో పాటు ఇతర అధికారులు ఒక్కసారిగా మాయమైపోయారు.



దీన్ని సీరియస్ గా తీసుకున్నప్పటికీ గవర్నర్ ఎక్కడా బయటపడలేదు. మేడారం అన్నది మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి కావటం గమనార్హం. సీన్ కట్ చేస్తే మొన్నటి ఉగాది పండుగను గవర్నర్ రాజ్ భవన్లో నిర్వహించారు. దీనికి కేసీయార్ తో పాటు మంత్రులు, అన్నీ పార్టీల ప్రజా ప్రతినిధులను, చీఫ్ సెక్రటరీ, డీజీపీతో పాటు అనేకమంది ఉన్నతాధికారులకు ఆహ్వానించారు. 



అయితే ఉగాది వేడుకల్లో కేసీయార్ పాల్గొనలేదు. కాబట్టి మంత్రులు, ప్రజాప్రతినిధులు, చీఫ్ సెక్రటరీ, డీజీపీలు కూడా హాజరుకాలేదు. అంటే రెండోసారి కూడా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినట్లే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రోటోకాల్ ఉల్లంఘన రాజకీయ నేతలకు నష్టం లేకపోయినా ఉన్నతాధికారులు మాత్రం నూరుశాతం పాటించాల్సిందే. ప్రోటోకాల్ వివాదంతో గతంలో పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీపై కేంద్రం ఎంతటి సీరియస్ యాక్షన్ తీసుకున్నదో అందరికీ తెలిసిందే. ఇపుడు గవర్నర్ ఫిర్యాదుతో ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే ఏమవుతుందో చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు తొందరలోనే తెలిసొస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: