మరో వందేళ్ల కోసం ప్లాన్ చేస్తున్న జగన్?

Chakravarthi Kalyan
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ఇంకా ఎన్నో సమస్యలు మిగిలిపోయాయి. టెక్నాలజీ ఇంతగా పెరిగిపోయినా ఇంకా అనేక వ్యవస్థల్లో పాతకాలపు పద్దతులే సాగుతున్నాయి. అలాంటి వాటిలో రెవెన్యూ రికార్డులు ఒకటి. అందుకే గ్రామాల్లో ఎన్నో భూమి పంచాయితీలు ఏళ్ల తరబడి కొనసాగుతుంటాయి. అందుకే ఇటీవల భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి, భూ సర్వే, రికార్డులను టెక్నాలజీతో అప్‌డేట్ చేస్తున్నారు.

ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం `వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష` ప‌థ‌కం తీసుకొచ్చింది. ఈ పథకం ప్రకారం గ్రామ కంఠాలను కూడా పక్కాగా సర్వే చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమం చాలా వేగంగా ముందుకు వెళుతోంద‌ని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ఈ పథకాన్ని సీఎం జగన్ ఎంతో ముందు చూపుతో రూపొందించారని.. వచ్చే వందేళ్ల వరకూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా సర్వేలు నిర్వహించాలని జగన్ సూచించారని మంత్రి బొత్స చెబుతున్నారు.

వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకం అమలు చేయడం వల్ల క్షేత్రస్థాయిలో ఫలితాలు చాలా బాగా ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ఇకపై ఈ `వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష` పథకాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. పట్టా భూములు, డీఫామ్‌ భూములు, గ్రామ కంఠాలు, చెరువులు అన్నింటినీ ఈ పథకం ద్వారా సర్వే చేస్తున్నారట.

గ్రామాల్లోని ఈనాం, దేవాలయ భూములు ఎన్ని ఉన్నాయనే వాటిపైనా లెక్కలు తీస్కున్నారట.  భవిష్యత్తులో కూడా భూముల విషయంలో ఎలాంటి సమస్యలు, తగాదాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ప్రభుత్వం దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని.. మరో వందేళ్ల వరకూ భూములకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు, వివాదాలు లేకుండా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. మాటల్లో కాకుండా..నిజంగానే ఈ పథకం సక్సస్ అయితే.. చాలా బావుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: