అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన హైదరాబాద్ మెట్రో రైల్‌?

Chakravarthi Kalyan
హైదరాబాదీలకు బ్రహ్మాండమైన శుభవార్త.. ప్రయాణికుల కోసం హైదరాబాద్‌ మెట్రో రైల్ ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించేసింది. ఇకపై హైదరాబాద్‌ మెట్రో రైల్లో సూపర్ సేవర్‌ కార్డు పేరుతో ఓ బ్రహ్మాండమైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సూపర్ సేవర్ కార్డును ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ కార్డుతో సెలవుల్లో జస్ట్ రూ.59తో రోజంతా మెట్రోలో ప్రయాణించవచ్చు. సెలవు రోజు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మెట్రో రైల్లో కేవలం 59 రూపాయలకు రోజంతా తిరగొచ్చని మెట్రో ఎండీ తెలిపారు.

అయితే.. ఈ ఆఫర్  మెట్రో సంస్థ ప్రకటించిన 100 రోజుల సెలవుల్లోనే వర్తిస్తుందని మాత్రం గుర్తుంచుకోవాలి. మెట్రో ప్రకటించిన 100 సెలవుల్లో ప్రతి ఆదివారం ఉంటుంది. అలాగే ప్రతి రెండో, నాలుగో శనివారాలు సెలవు రోజులే.. ఇవి కాకుండా ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగస్టు 15 కూడా సెలవు దినాలే. ఇంకా వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే రోజు కూడా సెలవు దినాలే.. ఇంకా బోగీ, సంక్రాంతి, శివరాత్రి రోజుల్లో కూడా ఈ సూపర్ సేవర్ ఆఫర్‌ వర్తిస్తుందన్నమాట.

అయితే ఈ కార్డు వినియోగం విషయంలో కొన్ని షరతులు ఉన్నాయి. ముందు ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే.. మొదట రూ. 50 వెచ్చించి ఓ సూపర్ సేవర్ కార్డు కొనుక్కోవాలి. ఆ తర్వాత ఏ సెలవు రోజైతే ప్రయాణిస్తామో.. ఆ రోజు.. ఈ సూపర్ సేవర్ కార్డును రీచార్జ్ చేయించుకోవాలి. అంతే.. ఇక ఆ కార్టు ఆ రోజంతా ఎన్నిసార్లు మెట్రో ఎక్కి దిగినా మిమ్మల్ని అనుమతిస్తుందన్నమాట.

ఇది నిజంగా హైదరాబాద్ నగర ప్రజలకు బ్రహ్మాండమైన ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. మెట్రో రైల్‌లో ఒక్కసారి ప్రయాణం చేస్తేనే సగటున టికెట్ 50 రూపాయలు ఉంటుంది. అలాంటప్పుడు కేవలం 59 రూపాయలకే రోజంతా ప్రయాణం ఉచితం అంటే బ్రహ్మాండమేగా మరి. ఇదే ఆఫర్ ఆర్టీసీలో రూ. 100 గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: