ఇక పాక్ ప్రధాని పరిస్థితి ఏంటి?

Purushottham Vinay
పొరుగు దేశం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే ? అవుననే అంటోంది పాకిస్తాన్ మీడియా. విదేశీ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఇప్పటికే పాక్ ప్రధాని ఇమ్రాన్ పై కేసులున్నాయి.ఇక ఎప్పుడైతే ఇమ్రాన్ రాజీనామా చేయగానే మాజీ ప్రధానమంత్రి అయిపోతారో దాంతో ఇప్పుడున్న ఇమ్యూనిటిలో చాలావరకు తొలగిపోతుంది. కాబట్టి అరెస్టు చేయటం చాలా ఈజీ అవుతుంది.ఇప్పటికే ఇమ్రాన్ ప్రభుత్వం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పాలి. భాగస్వామ్య పార్టీలు కూడా సపోర్ట్ ని విత్ డ్రా చేసుకున్నాయి. ఇదే సమయంలో మంత్రివర్గంలోని ముగ్గురు సభ్యులతో పాటు సొంత పార్టీకే చెందిన 24 మంది ఎంపీలు కూడా రాజీనామాలు చేశారు.దాంతో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చనే సంకేతాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. సోమవారం నాడు పార్లమెంటులో బలప్రదర్శన జరగబోతోంది. అందుకనే ప్రభుత్వం పడిపోకముందే తానే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట ఇమ్రాన్.ఆదివారం నాడు ఇస్లామాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ ర్యాలీ సందర్భంగా ఇమ్రాన్ తన రాజీనామాను ప్రకటించబోతున్నట్లు ఆయన సన్నిహితులు నుంచి సమాచారం తెలుస్తుంది.


ఇటు రాజీనామా ప్రకటించటం అటు ముందస్తు ఎలక్షన్స్ కు సిఫారసు చేయటం వెంటవెంటనే జరిగిపోతాయని సన్నిహిత వర్గాలు ఊహిస్తున్నాయి. ఇమ్రాన్ ప్రభుత్వంపై సైన్యం విశ్వాసం కోల్పోయినట్లు కూడా ప్రచారం జరగుతోంది. పైగా ఆర్మీ చీఫ్ కూడా ప్రధానమంత్రి రాజీనామాను కోరినట్లు ప్రచారం.ఫస్ట్ నుంచి పాకిస్థాన్ ప్రభుత్వంపై సైన్యానిదే సర్వాధిపత్యం. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగుతున్నా కూడా అధికారం మొత్తం సైన్యం చేతిలోనే కేంద్రీకృతమయ్యుంది. అందుకనే ప్రధాన మంత్రిగా ఎవరున్నా ముందు సైన్యాన్ని మంచి చేసుకునేందుకే ప్రాధాన్యతనిస్తారు. లేకపోతే ఎక్కువ రోజులు పదవిలో ఉండలేరన్న సంగతి అందరికీ తెలుసు.ఇక ఇపుడు ఇమ్రాన్ కు కూడా అలాంటి పరిస్ధితే ఎదురయ్యింది. విచిత్రమేమంటే గతంలో పాకిస్థాన్ కు ప్రధానులుగా పనిచేసిన వారంతా కూడా ఏదో రూపంలో శిక్షలు అనుభవించాల్సొచ్చింది. లేదంటే పర్వేజ్ ముషారఫ్ లాగా దేశం విడిచి పారిపోవాలి. మరి ఫ్యూచర్ లో పాపం ఇమ్రాన్ పరిస్థితి ఏమవుతుందో అనేది చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: