మండలి సీటు పోయినట్లేనా?

M N Amaleswara rao
టీడీపీ-జనసేన పొత్తు విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసినట్లే అని చెప్పొచ్చు...నెక్స్ట్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఖచ్చితంగా ఉంటుందని అర్ధమైపోతుంది...ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు...అయితే ఇప్పుడే పొత్తు గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఉండదు..ఎన్నికల సమయంలోనే పొత్తు గురించి ప్రకటన ఉండొచ్చు..అలాగే సీట్ల పంపకాల గురించి చర్చ కూడా అప్పుడే జరగనుంది.
అంటే అంతా ఎన్నికల ముందే తేలుతుంది..అయితే ఈలోపే పొత్తు గురించి అనేక చర్చలు వచ్చేస్తున్నాయి...పొత్తు దాదాపు ఖాయం కాబట్టి..టీడీపీ-జనసేన మధ్య జరిగే సీట్ల పంపకాల విషయంలో చర్చ వస్తుంది...జనసేనకు అన్ని సీట్లు ఇవ్వొచ్చు...ఇన్ని సీట్లు ఇవ్వొచ్చు అని ప్రచారం మొదలైంది..ఈ క్రమంలోనే జనసేనకు ఇచ్చే సీట్లపై రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. జనసేనకు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఇవ్వొచ్చని ప్రచారం వస్తుంది.
ఈ జిల్లాల్లోనే జనసేన ఎక్కువ సీట్లు తీసుకుంటుందని తెలుస్తోంది..ఇదే సమయంలో కొన్ని సీట్ల విషయంలో జనసేన క్లారిటీ తెచ్చుకుంటుంది...కాపు ఓటింగ్ ఎక్కువ ఉన్న నియోజకవర్గాలని మాత్రం వదులుకోకూడదని జనసేన భావిస్తుంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ సీటుని మాత్రం వదులుకోకూడదని జనసేన భావిస్తుంది..మామూలుగా అవనిగడ్డ టీడీపీకి కంచుకోట...అయితే ఇక్కడ కాపు ఓటింగ్ ఎక్కువ..కాపులు ఇక్కడ టీడీపీకే ఎక్కువ సపోర్ట్..కానీ ఎప్పుడైతే జనసేన ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి సీన్ మారిపోయింది. ఇక 2014లో పవన్ సపోర్ట్ చేయడంతోనే ఇక్కడ టీడీపీ గెలిచింది...2019 ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్లే ఓట్లు చీలిపోయి, టీడీపీ ఓడిపోయి, వైసీపీ గెలవడం జరిగింది.
ఇక నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటే ఖచ్చితంగా వైసీపీ గెలుపు అనేది కష్టమైపోతుంది..అయితే సీటు టీడీపీకి దక్కుతుందా? జనసేనకు దక్కుతుందా? అనేది క్లారిటీ లేదు...టీడీపీ ఈ సీటు వదులుకోదు..పైగా ఇక్కడ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. అలా అని ఈ సీటు జనసేన వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు..ఎందుకంటే ఇక్కడ కాపు ఓటింగ్ ఎక్కువ. కాబట్టి అవనిగడ్డ సీటు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: