రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి చురక!

Purushottham Vinay
పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నాకు ఝలక్‌ ఇవ్వడం కాదు.. నేనే ఆయనకు ఝులక్‌ ఇస్తానని వార్నింగ్‌ ఇచ్చారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… ఇక టి.పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న నాకు ఝలక్‌ ఇచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పుకుంటున్నాడు.. ఈ పరిణామంతో నన్ను మరింత హట్‌ చేశారని కోపం వ్యక్తం చేశారు.. నాకు రాజకీయ ఝలక్ రేవంత్ ఇవ్వడం కాదు.. నేను ఇస్తా అని ఆయన ప్రకటించారు.. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న మజా ఇంకో పార్టీలో ఉండదన్న ఆయన.. రేవంత్ రెడ్డి పై బురద జల్లే అవసరం నాకు లేదు.. ఇలాంటి అవకాశం కల్పించింది కూడా రేవంత్ రెడ్డి అని అన్నారు.. నేను ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరుకుంటున్న.. జీవితాంతం ఈ పార్టీలోనే ఉండాలని ఉంది.. నేను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే పార్టీలో ఉంటున్నాను అన్నారు.. అయితే, ముత్యాల ముగ్గు సినిమాలో హీరోయిన్ టైపు అయ్యింది నా పరిస్థితి అని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.. నేను హీరోయిన్ అయితే హీరో కాంగ్రెస్ పార్టీ. ఇక విలన్ రేవంత్ రెడ్డి అని కామెంట్స్ చేసిన ఆయన.. చంద్రబాబు నాయుడు రేవంత్‌రెడ్డికి కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వలేదు అని కామెంట్స్ చేశారు.


ఇక కాంగ్రెస్ పార్టీతో కానీ.. సోనియా ఇంకా రాహుల్ గాంధీతో గానీ ఎలాంటి ఇబ్బంది లేదన్నారు జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఎదిగాను..అలాగే విజయవంతంగా నడిపించుకున్నాను.. ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకున్న అలవాటు అని ఆయన అన్నారు.. ఇక రాష్ట్ర విభజన సమయంలో కూడా అలాగే చెప్పినా.. విడిపోతే చాలా నష్టం అని చెప్పినా.. ఆ రోజు తెలంగాణ ద్రోహిగా నన్ను ముద్ర వేశారని గుర్తుచేసుకున్నారు.అలాగే పీసీసీ కావాలని నేను కూడా అడిగా… రేవంత్ రెడ్డి అయ్యారు.. మేడం నిర్ణయం అని వదిలేశా అని అన్నారు.. తెలంగాణ వ్యతిరేకించిన టైంలో కూడా నాతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు రాలేదన్నారు జగ్గారెడ్డి.. ఇక, సోనియా ఇంకా రాహుల్‌ది గొప్ప ఫ్యామిలీ… రాజీవ్ గాంధీని చంపిన వ్యక్తికి కూడా క్షమాభిక్ష పెట్టండి అని వారు చెప్పారు.. అది వాళ్ల గొప్పతనం అని అన్నారు జగ్గారెడ్డి.


అలాగే మరోవైపు, పంచాయితీ అంతా రేవంత్ రెడ్డి నాకేనన్న ఆయన.. ఇక నేను కాంగ్రెస్ పార్టీని నష్ట పరుస్తునా అని అనుకుంటున్నారు.. కాంగ్రెస్‌ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి.. జగ్గారెడ్డిల గుణం ఏంటని చెప్పా అని అన్నారు.. రేవంత్ రెడ్డి తో కలిసి పని చేయడానికి ఇబ్బంది లేదని ఎన్నో సార్లు చెప్పినా కాని అయినా సోషల్ మీడియాలో టీఆర్ఎస్‌ ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.. నేను బీజేపీ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌కి వెళ్లినా..లేక టీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్ కి వచ్చా.. ఇక రెండు మూడు పార్టీలు నేను కూడా తిరిగినా.. కానీ, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ఇంకా అలాగే ఉత్తమ్‌లపై కూడా సోషల్ మీడియాలో టీఆర్ఎస్‌ కండువాలు కప్పుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు జగ్గారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: