టీడీపీ స్లోగన్‌: బాబాయి గుండెపోటు ఫేక్, కల్తీ మద్యం నిజం?

Chakravarthi Kalyan
కల్తీ మద్యం అంశాన్ని టీడీపీ ఇప్పట్లో వదిలేలా లేదు.. అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో వారు వరుసగా ఆరో రోజూ ఆందోళనకు దిగారు. కల్తీ నాటుసారాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జేబ్రాండ్ మద్యం  వల్ల వందలాది మంది చనిపోతున్నారంటూ నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసన వ్యక్తం చేసింది. కోడికత్తి ఫేక్, సారా మరణాలు నిజం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బాబాయి గుండెపోటు ఫేక్, కల్తీ మద్యం నిజం అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు.

కల్తీ నాటుసారాతో పాటు జె బ్రాండ్ తో జగన్ రెడ్డి జనాల ప్రాణాలు తీస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రాన్ని జే బ్రాండ్ మద్యం, కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ ముంచెత్తుతున్నాయని  టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. నాసిరకం మద్యం, నాటుసారాతో మహిళల మంగల్యాలు జగన్ రెడ్డి తెంచుతున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు. అసెంబ్లీలో అసత్య ప్రకటన చేసిన సీఎం రాజీనామా చేయాలని.. జె బ్రాండ్స్ తో జగన్ జనాల ప్రాణాలు తీస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు.

కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని  టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఇంకెన్ని సారా చావులు జగన్ రెడ్డి కోరుకుంటారని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శించారు. సచివాలయం నుంచి అసెంబ్లీకి నిరసన ర్యాలీ చేపట్టిన టీడీపీ శాసనసభ పక్షం... కల్తీ సారా మరణాల పై ప్రశ్నిస్తే అన్యాయంగా తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారని మండిపడింది.

రూ.100కి 3ప్యాకెట్ల నాటుసారా రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతున్నారని టీడీపీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. విచ్చలవిడిగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నారని.. ఒక్క పశ్చిమ గోదావరి  జిల్లాలోనే 48 బెల్టు షాపులు పోలీసులు గుర్తించారని గుర్తు చేశారు. మద్యం మరణాలపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందని.. అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకే లేని పెగాసెస్ పై రచ్చ చేస్తున్నారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: