హైదరాబాద్ : కోమటిరెడ్డి బ్రదర్స్ సర్దుకుంటున్నారా ?

Vijaya



తెలంగాణా కాంగ్రెస్ లో నిత్య అసంతృప్తులుగా ముద్రపడిన కోమటిరెడ్డి బ్రదర్స్ తొందరలోనే అన్నీ సర్దుకోబోతున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగాను, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎంఎల్ఏగా  ఉన్నారు. నల్గొండ జిల్లాలో బ్రదర్స్ ఇద్దరికీ మంచిపట్టుంది. పార్టీలతో సంబంధాలు లేకుండా సొంతంగా అయినా గెలిచేంత శక్తుంది. అందుకనే వీళ్ళద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నిత్యం అసంతృప్తితోనే ఉంటారు.



తాము అనుకున్నది జరగకపోతే ఇక రచ్చ మొదలుపెట్టేస్తారు. పీసీసీ అధ్యక్షపదవి కోసం వెంకటరెడ్డి చాలా ప్రయత్నాలే చేశారు. అయితే పగ్గాలు రేవంత్ రెడ్డికి దక్కింది. దాంతో అప్పటినుండి వెంకటరెడ్డి నానా గోల చేస్తున్నారు. ఇక తమ్ముడు రాజగోపాలరెడ్డి ఎప్పటినుండో గోల చేస్తునే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానంటారు. బీజేపీలో చేరిపోతున్నట్లు ఆమధ్య ప్రకటించేశారు కూడా. అయితే తూచ్ తాను బీజేపీలోకి వెళ్ళటంలేదన్నారు.



కాంగ్రెస్ లోనే ఉంటు పీసీసీ అధ్యక్షుడిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతునే ఉంటారు. ఈమధ్యనే రేవంత్ తో వెంకటరెడ్డి చేతులు కలిపినట్లే అనిపించింది. అయితే మళ్ళీ ఏమైందో ఏమో మళ్ళీ బ్రదర్స్ ఇద్దరు తొందరలోనే బీజేపీలోకి జంప్ చేయటం ఖాయమనే ప్రచారం మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో నాలుగుచోట్ల మంచి మెజారిటితో విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటినుండి బ్రదర్స్ మనసంతా మళ్ళీ కమలం వైపు లాగుతున్నట్లుంది. వెళ్ళేంతలోపు కాంగ్రెస్ ను ఏదో పద్దతిలో గబ్బుపట్టించాలన్నదే వీళ్ళ టార్గెట్ గా కనిపిస్తోంది. 



పైగా ఇప్పటికే బ్రదర్స్ తో మంచి సంబంధాలున్న కొందరు మాజీ కాంగ్రెస్ నేతలు బీజేపీలో బిజీగా ఉన్నారు. బహుశా వాళ్ళేమన్నా కోమటిరెడ్డితో బ్రదర్స్ తో టచ్ లో ఉన్నట్లున్నారు. అందుకనే తాజాగా బ్రదర్స్ మళ్ళీ బీజేపీ అంటు పాట మొదలుపెట్టారు. కొద్దిరోజులుగా బ్రదర్సిద్దరు బీజేపీని ప్రశంసిస్తు మాట్లాడుతున్నారు. దీంతో అందరికీ వీళ్ళు పార్టీ మారే విషయంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. అదేదో బ్రదర్స్ తొందరగా నిర్ణయం తీసుకుని అమలు చేసేస్తే పార్టీలోని మిగిలిన నేతలన్నా ప్రశాంతంగా ఉంటారనే టాక్ కూడా పార్టీలో పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: