లేడీ కోటాలో పోటీ ఎక్కువే?

M N Amaleswara rao
ఏపీలో మంత్రి పదవులపై చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు చాలా ఆశలు పెట్టుకున్నారు...ఎలాగైనా ఒక్కసారి మంత్రి అనిపించుకోవాలని చాలామంది అనుకుంటున్నారు...ఇక మంత్రి పదవి దక్కించుకోవడానికి ఇదే చివరి అవకాశం అన్నట్లు చాలామంది నేతలు ట్రై చేస్తున్నారు..పైగా ఇటీవల జగన్ కూడా మంత్రివర్గంలో మార్పులు గురించి కామెంట్ చేయడంతో...ఆశావాహుల్లో ఆశలు మరింత చిగురించాయి..ఈ క్రమంలోనే పదవి దక్కించుకోవడం కోసం ఎవరికి వారు తమవంతు ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు.
అయితే మహిళల కోటాలో మంత్రి పదవి దక్కించుకునే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది..మహిళల కోటాలో పదవి కోసం చాలామంది పోటీపడుతున్నారు..ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్న విషయం తెలిసిందే..పుష్పశ్రీ వాణి, తానేటి వనిత, మేకతోటి సుచరిత క్యాబినెట్‌లో ఉన్నారు...ఇక మంత్రివర్గంలో మార్పులు జరిగితే ఈ ముగ్గురు పోస్టులు ఊడటం గ్యారెంటీ..ఇందులో ఎలాంటి డౌట్ లేదు..ఎందుకంటే వీరు మంత్రులుగా గొప్ప పనితీరు కూడా కనబర్చలేదు.
ఇక వీరు ముగ్గురు సైడ్ అయితే మరో ముగ్గురుని తీసుకుంటారా? లేక ఇంకా ఎక్కువ మందికి ఛాన్స్ ఇస్తారా? అనేది క్లారిటీ లేదు..సరే ఏదేమైనా మహిళా కోటాలో మంత్రి పదవులైతే ఇవ్వాలి. ఇక మహిళా కోటాలో ఛాన్స్ దక్కించుకోవడం కోసం నగరి ఎమ్మెల్యే రోజా గట్టిగానే ట్రై చేస్తున్న విషయం తెలిసిందే...ఈమె ప్రస్తుతం మహిళా కోటాలో ముందు వరుసలో ఉన్నారు...జగన్ సైతం రోజాకు పదవి ఇవ్వడానికి రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది.
రోజాని పక్కన పెడితే..ఇంకా కొంతమంది మహిళా ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశిస్తున్నారు..వారిలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, శింగనమల ఎమ్మెల్యే జొన్నగలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి..ఇలా పలువురు మహిళా ఎమ్మెల్యేలు క్యాబినెట్ రేసులో ఉన్నారు. అయితే వీరిలో జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది క్లారిటీ మాత్రం లేదు...చూడాలి మరి లేడీ కోటాలో మంత్రులుగా ఛాన్స్ కొట్టేసే..ఆ లేడీ ఎమ్మెల్యేలు ఎవరో?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: