చికెన్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా..?

NAGARJUNA NAKKA
చికెన్ ధరలు పెరిగేందుకు ఉక్రెయిన్, రష్యా యుద్ధమే కారణమని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. కోళ్లకు దాణాగా వేసే మొక్కజొన్న, సోయాబీన్ ఎగుమతులు ఉక్రెయిన్ నుంచి ఆగిపోయాయని చెబుతున్నారు. దీంతో ఇతర దేశాలు ఇండియాను ఆశ్రయించడంతో డిమాండ్ బాగా పెరిగిందన్నారు. ఇండియా నుంచి సోయా, మొక్కజొన్న ఎగుమతులు ప్రారంభం అయ్యాయని.. తద్వారా ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. కేజీ సోయా బీన్ 40రూపాయల నుంచి 70రూపాయలకు పెరిగిందన్నారు.
ఇక అంతర్జాతీయ న్యాయస్థానం హెచ్చరించినా.. రష్యా వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ఉక్రెయిన్ పై భీకర దాడికి పాల్పడుతున్న రష్యా.. దాని తీవ్రత మరింత పెంచే దిశగా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకు వైమానిక, క్షిపణుల దాడులు చేస్తోన్న రష్యా యుద్ధ నౌకలను సైతం రంగంలోకి దించినట్టు సమాచారం. ఉక్రెయిన్ వైపు రష్యా యుద్ధ నౌకలు వెళ్తున్నట్టు జపాన్ రక్షణ శాఖ తెలిపింది. అందుకు సంబంధించిన చిత్రాలను విడుదల చేసింది.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంలో నిన్న జరిగిన ఓ ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఉక్రెయిన్ లోని తీర ప్రాంత నగరమైన మేరియుపొల్ లోని ఒక థియేటర్ పై బాంబుల వర్షం కురిపించింది. ఆ సమయంలో ఆ థియేటర్లో వెయ్యి నుంచి 1200 మంది వరకు పౌరులు తలదాచుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్యపై సమాచారం లేదు. అయితే థియేటర్ పై దాడికి ముందు తర్వాత ఫోటోలు వైరల్ గా మారాయి.
ఉక్రెయిన్ పై యుద్దం ప్రారంభించిన 20రోజుల్లోనే 7వేల మందికిపైగా రష్యా సైనికులు చనిపోయారని.. 17వేల మందికి పైగా గాయపడ్డారని అమెరికన్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. ఈ సంఖ్య తాము అఫ్ఘన్, ఇరాక్ లో 20ఏళ్లు చేసిన పోరాటంలో చనిపోయిన అమెరికా సైన్యం కంటే చాలా ఎక్కువని తెలిపింది.
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యకు దిగడం తనను ఆశ్చర్యపరిచిందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్ సరిహద్దులకు సైన్యాన్ని పంపిస్తుంటే చర్చలు జరిపేందుకు అనుకున్నాననీ.. కానీ ఉక్రెయిన్ పై ఆక్రమణకు పాల్పడటం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. పుతిన్ చాలా మారిపోయారని.. ఇది ప్రపంచానికి బాధాకరమైన విషయమన్నారు ట్రంప్. తాను అమెరికా అధ్యక్ష పదవిలో ఉండుంటే ఉక్రెయిన్ దురాక్రమణ జరిగేది కాదన్నారు.










మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: