కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టిన రష్యా..!

NAGARJUNA NAKKA
ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ పై మిలటరీ దాడిని వెంటనే ఆపాలని ఆదేశించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ బలగాలను వెనక్కి రప్పించాలని సూచించింది. దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. అంతర్జాతీయ కోర్టులో తామే గెలిచామని.. ఇంటర్నేషనల్ లా ప్రకారం కోర్టు ఆదేశాలను రష్యా తప్పక పాటించాలని అన్నారు.
ఉక్రెయిన్ పై సైనిక చర్యను రష్యా తక్షణం నిలిపివేయాలని నిన్న అంతర్జాతీయ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. మొత్తం 15మంది న్యాయమూర్తులు ఉన్న ఐసీజేలో 13-2 మెజార్టీతో ఈ తీర్పు వెలువరించింది. ఐసీజేలోని భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ ఈ తీర్పును సమర్థిస్తూ రష్యాకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో భారత్ అన్ని ఓటింగుల్లో తటస్థంగా ఉంటూ వస్తోంది.
అయితే ఉక్రెయిన్ పై యుద్ధం వెంటనే ఆపేయ్యాలంటూ అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రష్యా అస్సలు వినిపించుకోవడం లేదు. కోర్టు ఆదేశాలను తాము తిరస్కరిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధంపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి రష్యా స్పష్టం చేసింది. అయితే ఉక్రెయిన్ లోని బలగాలను వెనక్కి రప్పించాలంటూ నిన్న అంతర్జాతీయ కోర్టు రష్యాను ఆదేశించింది.
ఇక ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ రష్యాను సస్పెండ్ చేసింది. ఇక ఫిడే నిర్వహించే ఏ టోర్నీలోనూ రష్యా ఆటగాళ్లు పాల్గొనలేరు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల కారణంగా ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాకు సహకరిస్తున్న బెలారస్ పై కూడా నేషేధం పడింది. అయితే ఆ రెండు దేశాల క్రీడాకారులు ఫిడే పతకం కింద టోర్నీల్లో పోటీ పడొచ్చు. ఐఓసీ సూచన మేరకు ఇప్పటికే అనేక క్రీడా సంఘాలు రష్యాపై నిషేధం విధించాయి.

రష్యా తీరుపై అంతర్జాతీయ కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: