చిన్న జీయర్ పై సీతక్క ఫైర్..!

MOHAN BABU
ఆదివాసీల ఇలవేల్పు దైవం  అయినటువంటి సమ్మక్క-సారలమ్మలను అవమానించేలా మాట్లాడారని ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా ఫైర్ అయ్యారు. దేవతల మీద ఇలా తీవ్రంగా మాట్లాడటం దుర్మార్గమని, ఇలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పేదల ఇల్లు కట్టుకుందాం అంటే వంద గజాల స్థలం కూడా దొరకడం లేదని, నీకు మాత్రం వందల ఎకరాల స్థలం ఎలా వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న జీయర్ ఎప్పుడైనా పేదల ఇళ్లకి వెళ్ళారా, వారి బాధలను చూశారా అంటూ ఫైర్ అయ్యారు.

 ప్రకృతి దేవతల దర్శనం  ఉచితంగా ఉంటుందని ఆమె అన్నారు. అదే సమతా మూర్తి విగ్రహం దగ్గర ఈక్వాలిటీ ఉందా అక్కడ దర్శనం చేసుకోవాలంటే 150 రూపాయల టికెట్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద అడవి బిడ్డల కొరకు పోరాటం చేసిన వీర వనితలు సమ్మక్క-సారలమ్మలని వారి చరిత్ర తెలియకుండా  అనవసరపు మాటలు మాట్లాడడం చాలా బాధాకరమని వారిని అవమానపరిస్తే అడవి బిడ్డలను కూడా అవమానించినట్లే అని అన్నారు. దైవం పేరు చెబుతూ కోట్ల ఆస్తులు కూడాబెట్టుకుని పేదల దైవమైన సమ్మక్క సారక్కలని ఆహ్వానించడం సిగ్గుచేటు అన్నారు. దైవ సంభూతుడనే పేరుతో రాజకీయాలు చేస్తూ ఉన్నాడని, మంచి మాటలు చెప్పేవారు పేదల పక్షాన ఉండాలని ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదని సమ్మక్క-సారక్కలను అవమానిస్తే తెలంగాణ ఆడబిడ్డలను అవమానించినట్లే అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం గొప్పతనం  ముందుగా తెలుసుకొని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయాలని, తెలుసుకోకుండా మాట్లాడడం అనేది మంచిది కాదన్నారు.

ఆంధ్ర ప్రాంతమైన చిన్న జీయర్ స్వామి  పోరాట ప్రతీకలైన సమ్మక్క సారక్క గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. డబ్బులు తీసుకోకుండా చిన్న జీయర్ స్వాముల వారు ఇప్పటి వరకు ఏదైనా పనిచేశారా అని కడిగిపారేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా వెళ్లిన ప్రోగ్రాం ను బట్టి రేటు, సెక్యూరిటీ ఉంటుందని అన్నారు. సమ్మక్క సారక్కలు కొలువుదీరిన మేడారంకి బడుగు బలహీన వర్గాలు ఎవరైనా వెళ్లి వస్తారని, కానీ చిన్న జీయర్ ఆశ్రమానికి ఇప్పటివరకు ఏ పేదవాడు వచ్చి సమస్య చెప్పుకున్నారా  అంటూ ప్రశ్నించారు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే  సహించేది లేదని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సీతక్క.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: