ఈసారి జగన్‌కు ‘కాపు’ కాసేది ఎవరో?

M N Amaleswara rao
మంత్రివర్గంలో మార్పులు...ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్...జగన్ ఎప్పుడైతే జూన్ నెలలో మంత్రివర్గంలో మార్పులు చేస్తానని చెప్పారో...అప్పటినుంచి సీన్ మారిపోయింది...వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారు మంత్రి పదవి దక్కించుకోవడం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు..జగన్ దృష్టిలో పడేందుకు కష్టపడుతున్నారు..పనిలో పనిగా చంద్రబాబుని తిట్టడంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు...అటు ఉన్న మంత్రులు తమ పదవులని నిలబెట్టుకోవడం కోసం అదే పనిలో ఉన్నారు.
మొత్తానికి ఎవరికి వారు మంత్రి పదవుల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు..అయితే ఇప్పటివరకు జగన్ కు కాపు వర్గానికి చెందిన మంత్రులు బాగానే అండగా ఉన్నారని చెప్పొచ్చు..ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు చేయడంలో ముందున్నారు...ఇలా కాపు మంత్రులు జగన్ కు సపోర్ట్ గా నిలబడుతూ వచ్చారు...ఇక ఇప్పుడున్న కాపు మంత్రులు తప్పుకుంటే వారి ప్లేస్ లో అదే కాపు వర్గానికి చెందిన వారిని మంత్రులుగా తీసుకోవాలి.
మరి ఈ సారి జగన్ కు కాపు కాసే మంత్రులు ఎవరనే దానిపై ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి...ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో పేర్ని నాని, ఆళ్ళ నాని, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణలు ఉన్నారు...వీరు కాపు వర్గానికి చెందిన మంత్రులు...మరి ఈ సారి అందర్నీ సైడ్ చేస్తే...వీరంతా తప్పుకోవాల్సిందే...మరి వీరి ప్లేస్ లో ఇప్పుడు ఎవరిని తీసుకుంటారనేది చూడాలి..ఇప్పటికే పలువురు కాపు ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ట్రై చేస్తున్నారు.


గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు, కృష్ణా నుంచి సామినేని ఉదయభాను, పశ్చిమ గోదావరి నుంచి గ్రంథి శ్రీనివాస్, పుప్పాల వాసు, తూర్పు గోదావరి నుంచి దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజా క్యాబినెట్ రేసులో కనిపిస్తున్నారు...మరి వీరిలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది క్లారిటీ లేదు. సీనియర్ నేత అయిన అంబటి మంత్రి పదవిపై బాగా ఆశలు పెట్టుకున్నారు...ఇదే చివరి ఛాన్స్ అన్నట్లు ట్రై చేస్తున్నారు...మళ్ళీ పరిస్తితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి...ఇప్పుడే అంబటి పదవి దక్కించుకోవాలని అనుకుంటున్నారు..చూడాలి మరి ఈ సారి ఏ కాపు నేతకు ఛాన్స్ ఉంటుందో.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: