ఢిల్లీ : కేజ్రీవాల్ అంటే మరీ ఇంతమంటుందా ?

Vijayaఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన విజయాలకన్నా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సాధించిన విజయం అద్భుతమనే చెప్పాలి.  ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్ల బీజేపీ తన అధికారాన్ని నిలుపుకుంది. కానీ పంజాబ్ లో ఆప్ విజయదుందిబి మోగించింది. 117 సీట్ల అసెంబ్లీలో ఆప్ 92 సీట్లలో గెలిచిందంటే అది ఎంతటి ఘన విజయమో అందరికీ అర్ధమవుతోంది. మరింతటి ఘన విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ ను ఎందుకని ముఖ్యమంత్రులెవరు అభినందించలేదు ?మొదటి నుండి కేజ్రీవాల్ కు బద్ధ విరోధైన నరేంద్రమోడి ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ను అభనందిస్తు ట్వీట్ చేశారు. చివరకు ఆప్ చేతిలో చావుదెబ్బ తిన్న అకాలీదళ్, కాంగ్రెస్ సైతం కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపాయి. అయితే ముఖ్యమంత్రుల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా కేజ్రీకి అభినందనలు చెప్పకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. బీజేపీ అంటే ఏమాత్రం పడని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్ అసలు పంజాబ్ లో ఆప్ విజయాన్ని పట్టించుకోలేదు.జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కూడా ఆప్ ఘన విజయాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవటమే విచిత్రంగా ఉంది. పంజాబ్ లో బీజేపీని చావుదెబ్బ కొట్టినందుకు మమత, కేసీయార్, విజయన్, థాక్రే, స్టాలిన్ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆకాశానికి ఎత్తేయాలి కదా ? ఎందుకంటే వీళ్ళందరికీ బీజేపీ లేదా మోడి కామన్ ప్రత్యర్ధి. మరంటి మోడిని దెబ్బకొట్టినందుకు కచ్చితంగా కేజ్రీవాల్ అభినందనీయుడే.ఇదే సమయంలో కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బకొట్టినందుకైనా మమత, కేసీయార్, విజయన్ కనీసం కేజ్రీవాల్ ను ఎందుకు అభినందంచలేదో అర్ధం కావటంలేదు. వీళ్ళ వరసచూస్తుంటే తమ క్యాలిక్యులేషన్లలో ఏ విధంగా కూడా ఇమడడు కాబట్టి అర్వింద్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తీర్మానించుకున్నట్లే ఉంది. ఘన విజయాన్ని సాధించిన వ్యక్తిని అభినందించటానికి కూడా సాటి ముఖ్యమంత్రులకు మనసు రావటంలేదంటే మరీ ఇంత అన్యాయమా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: