అలకల కాంగ్రెస్: పలకరించుకున్న ఫైర్ బ్రాండ్లు..!

MOHAN BABU
కాంగ్రెస్ పార్టీ అంటేనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాయకుల మధ్య ఐక్యత లేక ఎన్నో వివాదాలతో ఈ కింది స్థాయికి చేరుకుంటున్నారు. దీనివల్లే ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకుండా పోతోంది. తెలంగాణ విషయానికి వస్తే ఇదే పరిస్థితి ఉంది. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక కొంత మార్పు వచ్చింది. మరి ఏం జరిగిందో తెలుసుకుందామా..!
ఇటీవల వరుస వివాదాలు తర్వాత సీఎల్పీలో ఆసక్తికర సన్నివేశం నెలకొంది. ఈ డి ఆఫీస్ కి వెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్ రెడ్డి సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఇదే సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అక్కడే ఉన్నారు. దీంతో ఇద్దరూ కలిసి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఒకరి చేతిలో ఒక చేయి వేసుకొని మీడియాకు పోజులిచ్చారు.

 
రేవంత్ రెడ్డికి టిపిసిసి పట్టం తర్వాత జగ్గారెడ్డి తరచూ వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగారు. రేవంత్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడం మాత్రమే కాకుండా.. ఆయన చేసే వ్యాఖ్యలపై సైతం వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు, నిరుద్యోగుల అంశం, ఐఏఎస్ లపై రేవంత్ చేస్తున్న విమర్శలను జగ్గారెడ్డి కొట్టిపారేస్తూ వచ్చారు. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రెండు మూడు రోజుల కిందట అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎల్పీకి రేవంత్ రెడ్డి వచ్చారు. అదే సమయంలో సీఎల్పీ లోనే ఉన్నా

 జగ్గారెడ్డి.. రేవంత్ రావడంతో ఛాంబర్ కు వెళ్ళకుండానే బయటకు వెళ్లిపోయారు. తాజాగా శుక్రవారం సీఎల్పీ కి వచ్చిన రేవంత్ రెడ్డి నేరుగా సీఎల్పీ నేత చాంబార్ కి వెళ్ళిన సమయంలో అక్కడే జగ్గారెడ్డి ఉన్నారు. దీంతో ఇద్దరూ పలకరించుకొని చేతిలో చేయ్యి వేసుకొని మీడియాకు ఫోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చలోక్తులు విసిరారు. మా ఇద్దరిదీ ఒకే స్కూల్ అంటూ పేర్కొన్నారు. జగ్గన్నా,తానూ ఒకటేనని పార్టీ కోసమే పని చేస్తాం అంటూ వ్యాఖ్యానించారు. ఇద్దరు ఫైర్ బ్రాండ్ లు భేటీ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: