సోము పగటికలలు...ఎమ్మెల్యే అవుతారా?

M N Amaleswara rao
దేశంలో కమల వికాసం ఆగట్లేదు..2014లో మొదలైన కమలం హవా...తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకు కొనసాగుతూనే ఉంది...మోదీ-అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ...తిరుగులేని స్థాయికి ఎదిగింది...కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కమలం...దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలనే కలని సాకారం చేసుకునే దిశగా వెళుతుంది..కాంగ్రెస్ ముక్త్ భారత్ ని విజయవంతంగా ముందుకు తీసుకెళుతుంది...తాజా ఫలితాలతో మరోసారి కమలం సత్తా తగ్గలేదని రుజువైంది..తాజాగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
వీటిల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీని దక్కించుకుని అధికారం దక్కించుకుంది..2024 పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటడం కమలం పార్టీకి కొత్త ఊపుని తీసుకొచ్చాయని చెప్పొచ్చు. అయితే ఈ ఫలితాల స్పూర్తితో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సత్తా చాటుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో కమలదళం దూకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే...అక్కడ టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదుగుతుంది.

నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా అక్కడ టీఆర్ఎస్ కు చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలనేది బీజేపీ లక్ష్యం. అయితే ఆ లక్ష్యం చేరడం బీజేపీకి బాగా కష్టమేమీ కాదు..ఇంకాస్త గట్టిగా కష్టపడితే బీజేపీ లక్ష్యం చేరుకోవచ్చు. కానీ ఏపీలో మాత్రం బీజేపీ గెలవడం అనేది జరగని పని..కేవలం ఒక శాతం ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీ...ఏపీలో గెలవడం అసాధ్యం...కానీ ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం...యూపీ ఫలితాలే ఏపీలో రిపీట్ అవుతాయని, ఏపీలో కూడా గెలిచి అధికారంలోకి వస్తామని చెబుతున్నారు.
అయితే గెలవడం విషయం పక్కన పెడితే...ఏపీలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న గొప్పే అని విశ్లేషకులు అంటున్నారు...బలమైన వైసీపీ, టీడీపీలని దాటి బీజేపీ గెలిచే పని కాదని, ఆఖరికి సోము వీర్రాజు ఎమ్మెల్యేగా నిలబడిన గెలవడం కష్టమని, కాబట్టి ఏపీలో బీజేపీ పగటి కలలు కనడం వేస్ట్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: