5 రాష్ట్రాల ఫైనల్ రిజల్ట్స్.. పార్టీలు, సీట్లు ఇవే!

Chakravarthi Kalyan
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితా వచ్చేశాయి. ఒక్క పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. యూపీలో వరుసగా రెండోసారి కమలం గెలిచింది. యూపీలో మొత్తం 403 స్థానాలు ఉన్నాయి. మెజార్టీకి 202 స్థానాలు అవసరమైచే 273 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుని.. అఖండ విజయం సాధించింది. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ కూటమి 125 స్థానాలను గెలుచుకుంది. బీఎస్పీ ఒకటి, కాంగ్రెస్‌ రెండు చోట్ల గెలిచాయి. ఇతరులు రెండు చోట్ల గెలిచారు.

పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించింది. గత ఎన్నికల్లో 20 స్థానాలను గెలిచిన ఆప్‌.. ఈసారి 92 చోట్ల విజయం సాధించింది. పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలు ఉన్నాయి. ఆప్ 92 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అతిపెద్ద పార్టీగా ఆప్ నిలిచింది. కాంగ్రెస్‌ మరీ దారుణంగా 18 సీట్లకే పరిమితం అయ్యింది. శిరోమణి అకాలీదళ్‌ కు నాలుగు స్థానాలు వచ్చాయి. బీజేపీ రెండుచోట్ల గెలవగా స్వతంత్ర అభ్యర్థి ఒకచోట గెలిచారు.

ఉత్తరాఖండ్‌లో మరోసారి కమలదళానికే అధికార పీఠం అందింది. ఇక్కడ మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి. సాధారణ మెజార్టీకి 36స్థానాలు అవసరమైతే బీజేపీ భాజపా 47 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు.

గోవాలోనూ బీజేపీ మళ్లీ అధికారం చేజిక్కించుకోబోతోంది. మెజారిటీకి కేవలం ఒక్క సీటు దూరంలో బీజేపీ నిలిచింది. అయితే.. స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 20చోట్ల బీజేపీ గెలిచింది. కాంగ్రెస్‌ 12 స్థానాలు గెలుచుకుంది. మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ రెండు చోట్ల గెలిచింది. రివల్యూషనరీ గోన్స్‌ పార్టీ ఒకటి,  స్వతంత్రులు మూడో చోట్ల గెలిచారు. ఆప్‌ రెండు స్థానాలు గెలిచింది.

ఇక మణిపూర్‌లో మళ్లీ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతోంది. ఇక్కడ మొత్తం 60 సీట్లు ఉన్నాయి. 32 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ ఏడు చోట్ల గెలిచింది. జనతాదళ్‌ (యూ) ఆరు స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్‌ 5 చోట్ల గెలవగా ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: