హైదరాబాద్ : కేసీయార్ మీద మైండ్ గేమ్ పెరిగిపోతోందా ?

Vijaya



నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలవటం కాదుకానీ కేసీయార్ మీద మైండ్ గేమ్ ఓ రేంజిలో పెరిగిపోతోంది. మామూలుగానే కేసీయార్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అండ్ కో గుక్కతిప్పుకోనీయకుండా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య తీసుకుని నానా రచ్చ చేసేస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. పంజాబ్ లో కమలంపార్టీ దెబ్బ తినేసినా మిగిలిన ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ లో ఘన విజయం సాధించింది.



ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ మంచి విజయాన్ని అందుకుందో అప్పటినుండి కేసీయార్ పై బండి మైండ్ గేమ్ మొదలుపెట్టేశారు. ఎన్నికలు రేపు వచ్చినా టీఆర్ఎస్ ను ఓడించటానికి తామంతా సిద్ధంగా ఉన్నామంటు పదే పదే ప్రకటిస్తారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ విజయం సాధించాలని కేసీయార్ ను రెచ్చగొడుతున్నారు. మొన్నటివరకు ముందస్తు ఎన్నికలు ఖాయమని గోల చేసిన ఇదే బండి తాజాగా వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలని రెచ్చగొడుతుండటం ఆశ్చర్యంగా ఉంది.



బండి మాటలు ఎంతవరకు నిజమో తెలీదుకానీ ఎక్కడో బీజేపీ గెలుపును చూసి తెలంగాణాలో బీజేపీ నేతలు రెచ్చిపోతుండటమే విచిత్రంగా ఉంది. ఆ రాష్ట్రాల్లో అంటే బీజేపీ బలంగా ఉందని అనుకోవచ్చు. కాబట్టి ఒకసారి ఓడిపోయినా మరోసారి గెలుస్తోంది. కానీ తెలంగాణాలో  పరిస్ధితి అదికాదు. పట్టుమని పదిసీట్లలో కూడా పార్టీ అభ్యర్ధులు డిపాజిట్లు తెచ్చుకునేంత సీన్ లేదు.



2019 ఎన్నికల్లో పార్టీ 117 సీట్లకు పోటీచేస్తే గెలిచింది కేవలం ఒకే ఒక్క అభ్యర్ధి. మిగిలిన అన్నీ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు. అలాంటి బీజేపీ తర్వాత జరిగిన మూడు ఉపఎన్నికల్లో రెండింటిలో అనూహ్యంగా  గెలిచింది. ఇందులో హుజూరాబాద్ లో పార్టీ గెలిచింది అనేకన్నా ఈటల రాజేందర్ గెలిచారు కాబట్టే బీజేపీ గెలిచిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే అసలు పోటీచేయటానికి పార్టీకి గట్టి అభ్యర్ధులు ఉన్నారా అన్నది డౌటే. అయినా సరే కేసీయార్ మీద బండి మైండ్ గేమ్ పెంచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: