జాతకాల పై నమ్మకంలేని ప్రభాస్ కు భవిష్యత్ ను చెప్పిన జ్యోతిష్కుడు !

Seetha Sailaja

‘రాథే శ్యామ్’ కథలో విక్రమాధిత్య పాత్రను పోషించిన ప్రభాస్ పాత్ర జ్యోతిష్కం చుట్టూ తిరుగుతుంది. విధిని ఎదిరించాలని ఎంత ప్రయత్నించినా ప్రతి వ్యక్తి ఏదో సందర్భంలో విధి ముందు ఓడిపోతాడు అన్న పాయింట్ చుట్టూ ఈ మూవీ కథ అల్లబడింది. ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తనకు జాతకాల పై నమ్మకం లేదని తాను ఇప్పటి వరకు ఎవరి దగ్గర జ్యోష్యం చెప్పించుకాలేదని కామెంట్ చేసాడు.

అయితే అలాంటి ప్రభాస్ కు ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్ళి అవుతుందని ఒక ప్రముఖ జ్యోతిష్కుడు చెప్పిన జ్యోష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడి పేరు ఆచార్య వినోద్ కుమార్ ప్రభాస్ జీవితంలో పెళ్ళి ఘడియలు వచ్చేసాయని ప్రస్తుతం అతడి జాతక చక్రంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయని వినోద్ కుమార్ అభిప్రాయ పడుతున్నాడు.  

ప్రభాస్ వయసు 42 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభాస్ కు పెళ్ళి అవ్వకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడ కలవర పడుతున్నారు. అయితే ప్రభాస్ మాత్రం తాను ప్రేమ విషయంలో తాను అనుకున్నది జరగలేదు అంటూ ఓపెన్ గా చెపుతున్నాడు. దీనితో ప్రభాస్ ఈ జ్యోతిష్కుడు చెప్పిన జాతకం ప్రకారం నిజంగా పెళ్ళి పీటలు ఎక్కితే అది అభిమానులకు పండగ.

గతంలో ఇలాగే ప్రభాస్ కు పెళ్ళి కుదిరిందని ఒక పారిశ్రామిక వేత్త కుమార్తె తో పెళ్ళి జరగబోతోంది అంటూ వార్తలు హోరెత్తిపోయాయి. అయితే ప్రభాస్ కుటుంబ సభ్యులు ఆవార్తను అప్పట్లో ఖండించారు. ‘రాథే శ్యామ్’ విడుదల సందర్భంగా ఇప్పుడు మళ్ళీ ఈ వార్తల హడావిడి మొదలు కావడం అభిమానులకు జోష్ ను ఇస్తోంది. ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్న ప్రభాస్ త్వరలో మారుతి దర్శకత్వంలో కూడ మరొక సినిమాను చేస్తాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనితో ప్రస్తుత పరిస్థితులలో ప్రభాస్ కు పెళ్ళి చేసుకునే సమయం ఉందా అన్నదే సమాధానం లేని ప్రశ్న..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: