యోగీ ఓటమి ఇలా ఖాయమైందా..? దిమ్మతిరిగే వాస్తవాలు..

Deekshitha Reddy
ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. అక్కడ అధికారం మళ్లీ మాదేనంటోంది బీజేపీ. ఈసారి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకుంటామంటోంది కాంగ్రెస్. సమాజ్ వాదీ పార్టీ కూడా విజయంపై ధీమాగా ఉంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అక్కడ బీజేపీ, ఎస్పీ మధ్య పోటాపోటీగా ఎన్నికల పోరు జరుగుతోంది. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు యోగీని అధికారానికి దూరం చేసేలా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.
యూపీ అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్న టైమ్ లో అధికార బీజేపీకి గ‌ట్టి షాక్‌ తగిలింది. బీజేపీ ఎంపీ రీటా బ‌హుగుణ జోషి కుమారుడు మ‌యాంక్‌.. సమాజ్‌ వాది పార్టీలో చేరారు. ఆజంఘ‌ఢ్ లోక్‌ స‌భ నియోజకవర్గ పరిధిలో ప్రచారానికి వచ్చిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఆయన పార్టీ మారారు. ల‌క్నో నుంచి బీజేపీ టికెట్ పై మయాంక్ పోటీ చేయాలనుకున్నారు. ఆయనకు బీజేపీ టికెట్ కేటాయించలేదు. దీంతో మయాంక్ పార్టీ మారారు. మరోవైపు మయాంక్ తల్లి రీటా బహుగుణ మాత్రం బీజేపీ ఎంపీగానే ఉండటం కొసమెరుపు.
నెల రోజులుగా మయాంక్ ఎస్పీలో చేరతారనే ప్రజారం జరిగింది. కానీ త‌న కుమారుడు పార్టీకి నిబద్ధుడని, ఆయన పార్టీ మారడని తల్లి, ప్రయాగ్ రాజ్ ఎంపీ రీటా బహుగుణ జోషి చెబుతూ వచ్చారు. కానీ ఎన్నాళ్లో ఆ అసంతృప్తి దాగలేదు. చివరిగా రీటా బహుగుణ కొడుకు మయాంక్ ఎస్పీలో చేరారు. బ్రాహ్మణ సామాజికవ‌ర్గంలో రీటా బహుగుణ కుటుంబానికి మంచి పేరుంది. ఇప్పుడు ఆమె కుమారుడు ఎస్పీలో చేరడంతో ఆ వర్గం ఓట్లపై ప్రభావం పడే అవకాశముంది.
మయాంక్ ఉదాహరణతో పాటు ఇంకా చాలామంది కూడా అదికార బీజేపీపై అసంతృప్తితో ఉన్నారనేది యూపీ టాక్. ఈ అసంతృప్తి జ్వాలలన్నీ ఇప్పుడే బయటపడలేదు. సమయం వచ్చినప్పుడు వారంతా బయటకి వస్తారు. అయికే ప్రస్తుతం ఎన్నికల వేళ వారంతా సైలెంట్ గా ఉన్నారు. యూపీలో యోగీకి ఏమాత్రం మెజార్టీ తగ్గినా, ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం దొరక్కపోయినా వారంతా తిరుగుబాటు ప్రకటించేందుకు సిద్దంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: