సీనియర్లకు హ్యాండ్..రేవంత్ ఇంకా తగ్గేదేలే..!

M N Amaleswara rao
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో రచ్చ ఆగేలా లేదు..ఏంటో మిగతా పార్టీలు ప్రత్యర్ధులపై పోరాటం చేస్తుంటే...ఈ కాంగ్రెసోళ్ళు మాత్రం...వారిలో వారే ప్రత్యర్ధులుగా మరి కుమ్ములాడుకుంటున్నారు..అసలు మొదట నుంచి కాంగ్రెస్‌లో కుమ్ములాటలు కామనే...కానీ ఈ మధ్య తెలంగాణలో కుమ్ములాటలు బాగా పెరిగాయి..ఇక రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యాక ఈ రచ్చ మరింత పెరిగింది..అదేంటి జూనియర్ నాయకుడు, పైగా టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు పి‌సి‌సి ఇవ్వడం ఏంటని చెప్పి కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోయే పరిస్తితి. ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్న విషయం తెలిసిందే...ఇక ఇటీవల జగ్గారెడ్డి ఏ స్థాయిలో రచ్చ చేస్తున్నారో తెలిసిందే.
అంటే పరిస్తితి ఎలా ఉందంటే...రేవంత్ ఏమో ఓ వైపు టీఆర్ఎస్‌పై, మరోవైపు బీజేపీపై పోరాటం చేసి...కాంగ్రెస్‌ని కాస్త పైకి లేపుదామని చూస్తుంటే...కాంగ్రెస్ సీనియర్లు మాత్రం రేవంత్ పెత్తనం ఏంటని చెప్పి...ఆయన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు...చాలాకాలం నుంచి కాంగ్రెస్‌లో ఇదే వరుస. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోలేకపోతుంది. చివరికి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేద్దామని చూస్తుంటే..దాన్ని కూడా అడ్డుకోవాలని చూస్తున్నారు.
అబ్బే రేవంత్ ఒక్కరే యాత్ర చేస్తే...ఆయనకే పేరు వస్తుందని, ఇంకా ఆయన హవా పెరిగిపోతుందని చెప్పి, ఆయన్ని అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు...పాదయాత్ర చేస్తే అందరు నేతలకు ప్రాధాన్యత దక్కేలా చేయాలని...లేదంటే ఎవరి నియోజకవర్గంలో పాదయాత్ర చేసుకునేలా ప్లాన్ చేయాలని చెప్పి అధిష్టానానికి సూచించే పరిస్తితి.
అంటే పార్టీ బాగుపడుతుంది అయ్యా అంటే...అబ్బే రేవంత్‌కు పేరు వస్తే ఎలా అని సీనియర్లు రాజకీయం చేసే పరిస్తితి...అందుకే ఇంకా రేవంత్ రెడ్డి సైతం..కలిసొచ్చిన వాళ్ళు వస్తారు లేదంటే లేదు అని చెప్పి..కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి రాష్ట్రమంతా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. పాదయాత్ర చేస్తేనే పార్టీకి కాస్త ఊపు వస్తుందని, లేదంటే మళ్ళీ అధికారానికి దూరమవ్వడం గ్యారెంటీ అని రేవంత్ వర్గం చెబుతోంది..మొత్తానికి రేవంత్ రెడ్డి  పాదయాత్ర చేయడం ఖాయమని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: