జానారెడ్డి-ఉత్తమ్-కోమటిరెడ్డి కాంబో సక్సెస్ అవుతుందా?

M N Amaleswara rao
జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి...తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు..దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నేతలు. రాజకీయంగా చాలా బలమైన నాయకులు కూడా...ముఖ్యంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కు మెయిన్ పిల్లర్స్ అని చెప్పొచ్చు..వీరి వల్లే నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోటగా తయారైంది..ఇక్కడ ఏ ఎన్నికలైన కాంగ్రెస్‌దే ఆధిక్యం అన్నట్లు పరిస్తితి ఉండేది.
ఆఖరికి తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కూడా నల్గొండలో కాంగ్రెస్ హవా నడిచింది...కానీ 2018 ఎన్నికల్లో మాత్రం నల్గొండలో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది..అలాగే జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఓడిపోయారు. అయితే హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు గాని...తర్వాత ఆయన నల్గొండ ఎంపీగా గెలవడంతో..హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు..దీంతో ఉపఎన్నిక వచ్చింది.
ఆ ఉపఎన్నికలో ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ చేసి ఓడిపోయారు...ఇలా తమ కంచుకోటని ఉత్తమ్ కోల్పోయారు. అటు జానారెడ్డి..తన కంచుకోట నాగార్జున సాగర్‌లో 2018లో ఓడిపోయారు..తర్వాత జరిగిన ఉపఎన్నికలో కూడా ఓడిపోయారు..ఇటు కోమటిరెడ్డి నల్గొండ అసెంబ్లీలో ఓడిపోగా, తర్వాత భువనగిరి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే..అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలు అసెబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు..కోమటిరెడ్డి...నల్గొండ లేదా భువనగిరి స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంది..అటు కోమటిరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో పోటీ చేయనున్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌లో, ఉత్తమ్ సతీమణి పద్మావతి కోదాడలో పోటీ చేయనున్నారు.
కాకపోతే జానారెడ్డి పోటీ చేసే అవకాశాలు లేవని అంటున్నారు...ఆయన ఇద్దరు కుమారులు ఈ సారి పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతుంది...నాగార్జున సాగర్, మిర్యాలగూడలలో పోటీ చేస్తారని తెలుస్తోంది. కానీ ఎవరు పోటీ చేసినా ఈ మూడు ఫ్యామిలీలు ఈ సారి విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని చెప్పొచ్చు..మరి చూడాలి ఈ సారి నల్గొండలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీలు సత్తా చాటుతాయో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: