టెన్ష‌న్ టెన్ష‌న్ : విభ‌జ‌న పై పోలీసు బాస్ ఏం చెప్పారంటే ?

RATNA KISHORE
ఉగాది నుంచి ఆరంభం కానున్న కొత్త జిల్లాల వ్య‌వ‌స్థ పై చాలా  చోట్ల చాలా అపోహ‌లు ఉన్నాయి.ఇప్ప‌టికీ  శ్రీ‌కాకుళంలాంటి జిల్లాలో పౌర సంబంధాల అధికారి కార్యాల‌యానికి సొంత భ‌వ‌నం కూడా లేదు.ఇదేవిధంగా రేప‌టి  వేళ అనేక ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వ‌స‌తే పెద్ద స‌మ‌స్య కానుంది.అదేవిధంగా స్టేష‌న్ ప‌రిధి, స‌రిహ‌ద్దుల గొడ‌వ‌లూ కూడా వెలుగులోకి వ‌స్తాయి.ప్ర‌స్తుతానికి క్షేత్ర స్థాయిలో కార్యాల‌యాల ఏర్పాటుకు సంబంధించి భ‌వ‌నాల ప‌రిశీల‌న మాత్ర‌మే జ‌రుగుతోంది.అయినా కూడా జ‌గ‌న్ మాత్రం ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల భ‌వ‌నాలు అయినా తీసుకుని మండ‌ల రెవెన్యూ ఆఫీసులుగా వాటిని మార్చేయాల‌ని అంటున్నారు. ఇప్ప‌టికే వాటి నిర్వ‌హ‌ణే అంతంత మాత్రంగా ఉంటే తాము వెళ్లి ఏ విధంగా విధులు నిర్వ‌ర్తిస్తామ‌ని రెవెన్యూ అధికారులు గ‌గ్గోలు పెడుతున్నారు.
ఈ నేప‌థ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జ‌గ‌న్ పూర్తి స్థాయిలో యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటులో ఎటువంటి లోపాల‌కు తావివ్వ‌కూడద‌ని కూడా చెబుతున్నారు. సాధ్య‌మయినంత మేర ప్ర‌భుత్వ భ‌వనాల్లోనే కార్యాల‌యాలు ఏర్పాటు చేయాల‌ని సూచిస్తున్నారు.ఇదే స‌మ‌యంలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్ప‌టిదాకా ఉన్న అభ్యంత‌రాల‌ను మ‌రోసారి స‌మీక్షించి కొన్ని కీల‌క నిర్ణ‌యాలు వెలువ‌రించేందుకు కూడా సిద్ధం అవుతున్నారు.ఈ ద‌శ‌లో పోలీసు అధికారుల‌కు సంబంధించి ఉన్న స‌మ‌స్య‌లు లేదా సందేహాల‌పై డీజీపీ రాజేంద్ర‌నాథ్ {{RelevantDataTitle}}