తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ లేదా? ఏమి జరుగుతోంది?

VAMSI
ఈ రోజు సమాజంలో ఆడపిల్లపై, మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక రోజులో రికార్డు లో నమోదు అవుతున్న కేసులు చాలా తక్కువ మాత్రమే. కానీ లెక్కలోకి రాకుండా దేశం నలుమూలల జరుగుతున్న దుర్మార్గాలు ఎన్నో? అయితే వీటిని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెస్తున్నప్పటికీ అవేమీ ఈ అన్యాయాలకు పాల్పడుతున్న వారిని ఏమీ చేయలేకున్నాయి. తాజాగా తెలంగాణలోని నిర్మల్ లో జరిగిన ఒక అత్యాచారం కలకలం రేపుతోంది. ప్రజలను కాపాడే ప్రజాప్రతినిధులే ఈ కేసులో నేరస్థుడు కావడం లోకం సిగ్గుపడే విషయం.
నిర్మల్ మునిసిపల్ వైస్ చైర్మన్ ఒక మైనర్ అమ్మాయిని నిర్మల్ నుండి హైద్రాబాద్ కు తీసుకెళ్లి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. దీనితో ఈ విషయం వైరల్ గా మారింది. అయితే ఈ దారుణానికి కారణం తెలిసినా పోలీసులు అతడిని అరెస్ట్ చేయకపోవడం ఇనక దారుణం. ఇదే విషయంపై బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ తనదైన శైలిలో రెచ్చిపోయారు. తెలంగాణలో మహిళలు, ఆడపిల్లలు జీవించడం కష్టంగా మారుతోందని తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అయితే నేరస్థుడు తెరాస పార్టీకు చెందిన నాయకుడు కావడం మూలంగానే ఇప్పటి వరకు పోలీసులు అతనిపై చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు అమ్మాయిలపై జరుగుతున్నాయి. కానీ అధికారంలో ఉన్న తెరాస ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని చెబుతూ సిరిసిల్లలో తప్పిపోయిన ఒక అమ్మాయి ఉదంతాన్ని బయటపెట్టింది. ఆ అమ్మాయి మిస్ అయి నెలరోజులు అవుతున్నా ఇప్పటి వరకు తెలుసుకోలేకపోవడం విచారకరమని ఆమె అధికార పక్షాన్ని దుయ్యబట్టారు. ఇది కేటీఆర్ నియోజకవర్గం అని అందరికీ తెలిసిందే. అయితే మంత్రి నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుంటే ఇక వేరే నియోగాజకవర్గాల పరిస్థితి ఏమిటని ఈమె ఘాటుగా ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు కుమ్మక్కై చర్యలు తీసుకోకుండా సైలెంట్ గా ఉన్నారు అంటూ ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: