సురక్షితంగా భారతీయుల తరలింపు ప్రక్రియ..!

NAGARJUNA NAKKA
ఉక్రెయిన్ లో చిక్కుకున్న 250 మంది భారతీయులతో రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి బయల్దేరిన రెండో ఎయిరిండియా విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. సురక్షితంగా దేశానికి చేరిన వారికి ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా, విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్ స్వాగతం పలికారు. వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకు ముందు 219మందితో మొదటి విమానం దేశానికి వచ్చింది.
మరోవైపు ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 2 విమానాల ద్వారా మొత్తం 469 మంది భారత్ కు తీసుకొచ్చారు. మొదటి విమానంలో 219మందిని, రెండో ఫ్లైట్ లో 250మందిని స్వదేశానికి తరలించారు. తాజాగా మూడో విమానం 240మందితో ఉక్రెయిన్ నుంచి బయల్దేరింది. ఇప్పటికే చేరుకున్న వారిలో ఏపీ, తెలంగాణ విద్యార్థులను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ భవన్ లో తాత్కాలికంగా వసతి కల్పించారు.
ఉక్రెయిన్ నుంచి తమను స్వదేశానికి తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటున్నారు విద్యార్థులు. ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుండటంతో చాలా భయపడినట్టు చెప్పారు. తమను భారత ప్రభుత్వం ఎలాగైనా స్వదేశానికి తీసుకొస్తుందనే నమ్మకం తమకు కలిగిందనీ.. అనుకున్నట్టుగానే తీసుకొచ్చిందంటున్నారు. ఇపుడు తమకు చాలా ఆనందంగా ఉందంటున్నారు. రోజుల వ్యవధిలోనే భారత ప్రభుత్వం స్పందించడం బాగుందంటున్నారు.
రష్యా దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ నుంచి భారీ ఎత్తున ప్రజలు పొరుగు దేశాలకు తరలిపోతున్నారు. దీంతో పోలండ్ లోని అనే సరిహద్దుల్లో మైళ్ల కొద్దీ దూరం కార్లు బారులు తీరుతున్నాయి. ఇప్పటి వరకు 1.20లక్షల మంది ఉక్రెయిన్ నుంచి పోలాండ్ ఇతర పొరుగుదేశాలకు వెళ్లిపోయినట్టు ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ తెలిపింది. మెడికా పట్టణ సరిహద్దు వద్ద మైళ్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. మొత్తానికి భారతీయులు ఉక్రెయిన్ నుంచి క్షేమంగా స్వదేశంలో అడుగుపెడుతున్నారు. దీంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: