బొజ్జల వారసుడుకు మళ్ళీ కష్టమేనా?

M N Amaleswara rao
ఇటీవల చంద్రబాబు వరుసపెట్టి అసెంబ్లీ స్థానాల వారీగా నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి...అభ్యర్ధులని ఖరారు చేయడం...అలాగే పనితీరు బాగోని ఇంచార్జ్‌లకి క్లాస్ పీకి, ఇంకా పనితీరు మెరుగు పర్చుకోవాలని చెప్పడం..లేదంటే ఇంచార్జ్‌లని పీకేసి కొత్తవారిని పెట్టడం చేస్తూ వస్తున్నారు. ఇంచార్జ్ పనితీరు బాగుంటే వారికి సీటు ఫిక్స్ చేసేస్తున్నారు..వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిగా డిసైడ్ చేస్తున్నారు.
ఒకవేళ పనితీరు కాస్త అటు ఇటుగా ఉంటే వారికి క్లాస్ పీకి..ఇంకా బెటర్‌గా పనిచేయాలని చెప్పి, మళ్ళీ పరిస్తితి చూసి సరిగ్గా పనిచేయకపోతే ఇంచార్జ్ పదవి నుంచి తొలగిస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక కొన్ని నియోజకవర్గాల్లో దారుణమైన పనితీరు కనబరిచే వారిని మొహమాటం లేకుండా పక్కన పెట్టేసి వేరే వాళ్ళకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు.
అయితే తాజాగా కూడా చంద్రబాబు...శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు..ఈ సమావేశంలో ఇంచార్జ్ gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్ రెడ్డికి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారని తెలిసింది. gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వారసుడుగా వచ్చిన సుధీర్ గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు..ఓడిపోయాక అప్పుడప్పుడు మాత్రమే  నియోజకవర్గంలో పనిచేస్తున్నారు...ఇక మిగిలిన సమయం హైదరాబాద్‌లో గడిపేస్తున్నారు...ఇదే విషయాన్ని కాళహస్తి టీడీపీ కార్యకర్తలు బాబుకు చెప్పారట. దీంతో చంద్రబాబు, gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్‌కు క్లాస్ ఇచ్చి..బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాదిరిగా కష్టపడాలని చెప్పి సూచించారట.
మళ్ళీ కొన్ని రోజులు చూసి...పరిస్తితి అలాగే ఉంటే మాత్రం ఇంచార్జ్ పదవి నుంచి తప్పిస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సుధీర్ అంత ఎఫెక్టివ్‌గా పనిచేయకపోవడం వల్ల కాళహస్తిలో టీడీపీ పెద్దగా బలోపేతం అయినట్లు కనిపించడం లేదు..అసలు కాళహస్తి అంటే టీడీపీ కంచుకోట...కానీ ఇప్పుడు ఆ పరిస్తితి కనిపించడం లేదు...అక్కడ వైసీపీ హవా నడుస్తోంది..వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పూర్తిగా దూకుడుగా ఉన్నారు..అలాంటప్పుడు సుధీర్ ఇంకా బాగా కష్టపడాలి..అప్పుడే కాళహస్తిలో టీడీపీ బలపడుతుంది...నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి నెక్స్ట్ కాళహస్తిలో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల వారసుడు టీడీపీ జెండా ఎగరవేస్తారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: