విశిష్ట ర‌చ‌న విద్యాత‌త్వ ద‌ర్శిని : ధ‌ర్మాన

RATNA KISHORE
- పుస్త‌కావిష్క‌ర‌ణ‌లో శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే
-వైదిక ప్రాశ‌స్త్యం వివ‌రించిన వైనం
 
గురువు విశిష్ట‌త‌ను వివ‌రిస్తూనే వైదిక కాండ‌ల్లో ఉన్న గొప్ప‌దనాన్ని చాటి చెప్పారు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఇవాళ.. ఆ వివ‌రం ఈ క‌థనంలో..\\వేద వాంగ్మ‌యంలో ముఖ్య‌మ‌యిన మంత్రోప‌దేశానికి సంబంధించి విద్యాత‌త్వ ద‌ర్శిని పుస్త‌కంను విడుద‌ల చేయ‌డం ఎంతో గొప్ప విష‌యం అని,ర‌చ‌యిత,శ్రీ  రాజ‌రాజేశ్వ‌రీ దేవీ పీఠం అధిప‌తి సుస‌రాపు దుర్గా ప్ర‌సాద్ శర్మ‌ను అభినందిస్తున్నాన‌ని శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్రసాద‌రావు అన్నారు.స్థానికంగా ఉన్న శ్రీ ఫంక్ష‌న్ హాల్లో ఏర్పాటు చేసిన శ్రీ ల‌ఘు శ్రీ చ‌క్రార్చ‌న గురుపూజో త్స‌వంకు అతిథిగా విచ్చేశారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..వేద పండితులు దుర్గా ప్ర‌సాద్ శ‌ర్మ చేప‌ట్టే ప్ర‌తి కార్య‌క్ర‌మం అంటే త‌న‌కు ఎంతో విశ్వాసం అని,లాభాపేక్ష లేకుండా ఉన్న‌త రీతిలో కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం అభినంద‌నీయం అని అన్నారు.ఎంతో నిష్టాగ‌రిష్టుడిగా ఉంటూ ఆయ‌న దైవిక కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తార‌ని కితాబిచ్చారు.
\\
అత్యుత్త‌మ ఫ‌లితాలు త‌న శిష్యుల‌కు అందాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న గురువు ఆయ‌నేన‌ని ప్ర‌శంసించారు.ప్ర‌తి ఒక్క‌రికీ జీవితంలో ఒక గురువు అవ‌స‌రం అని మ‌న సంప్ర‌దాయం,మ‌న సంస్కృతి చెబుతోంది అని,గురువు లేకుండా ఉంటే ఎవ్వ‌రైనా వ‌క్ర‌మార్గం ప‌ట్టేం దుకు వీలుంటుంది కానీ గురు హిత,గురు బోధ ఎలా ఉంటుందో త‌న‌కు తెలుసు అని, అటువంటి వారి జీవితం స‌మ‌యం వృథా కాదు అని,వారు స‌న్మార్గంలో ఉంటార‌ని,అటువంటి గురువు దుర్గా ప్ర‌సాద శ‌ర్మ అని అన్నారు.ఇలాంటి వారి ఆవ‌శ్య‌క‌త ఈ స‌మా జానికి ఎంతో ఉంద‌ని కూడా చెబుతూ,పండితుల వేదాశీర్వ‌చ‌నాలను అందుకోవ‌డం గొప్ప భాగ్య‌మ‌ని చెబుతూ ప్ర‌సంగం ముగించారు. కార్య‌క్రమంలో కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, గుమ్మా నగేష్, కోణార్క్ శ్రీనివాసరావు, అంధవరపు సంతోష్, ప్రసాద్, సురంగి మోహన్ రావు,చల్లా శ్రీనివాసరావు,మండవిల్లి రవి,మూకళ్ల తాతబాబు, పిల్లల నీలాద్రి, డీవీఎస్.ప్రకాశ్, పద్మారావు, టంకాల కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.కార్య‌క్ర‌మానికి ప‌లువురు వేద పండితులు సార‌థ్యం వ‌హించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: