ఆ గుట్ట నుంచి సమ్మక్కను ఏ విధంగా తీసుకొస్తారో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!

MOHAN BABU
తెలంగాణ గిరిజన ఆరాధ్యదైవం అడవి బిడ్డల పండగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. పూర్వ కాలం నుంచే ఇక్కడ ఏ గుడి, బంగారు విగ్రహాలు కానీ ఏవీ కనిపించవు. అంతా న్యాచురల్ గా పచ్చని పొలాల్లో పవిత్రమైన నేలమీద కొలువుదీరిన ఆ తల్లులే సమ్మక్క సారలమ్మ. చిలకల గట్టు, పచ్చని చెట్ల మధ్య ఉండే తల్లులు రెండు సంవత్సరాలకోసారి గద్దె మీదికి వస్తూ భక్తులకు కోరిన కోరికలు తీర్చే సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర తెలుసుకుందామా..!
మేడారం సమ్మక్క సారక్క జాతర లో మనకు ఎలాంటి గుడి కనిపించదు, విగ్రహం కనిపించదు. అడవి తల్లి ఒడే అమ్మవారి గుడి. సమ్మక్క ఇక్కడికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న చిలకల గుట్ట పైన ఉంటుంది. ఆమె నివాసం అక్కడే. జాతర సందర్భంగా పూజారులు వెళ్లి కుంకుమ భరిణె రూపములో ఉన్న సమ్మక్కను తీసుకొని వస్తారు.

 జాతర మొత్తంలో అదే అత్యంత ప్రధానమైన ఘట్టం. అక్కడికి వెళ్లే ముందు పూజలను కొన్ని రహస్య పూజలు చేస్తారు.ఎలాంటి పూజలు చేస్తారో,ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇప్పుడు తెలుస్తుంది. సమ్మక్క ఉండేటువంటి గుడిలో పూజలు చేసి అక్కడి నుండి గద్దె కు వస్తారు. సమ్మక్క కు సంబంధించిన వస్తువులు గద్దె పైన సమర్పిస్తారు. అమ్మవారి దగ్గరికి కేవలం ఇద్దరు గిరిజన పూజారులు మాత్రమే వెళ్తారు. అమ్మవారిని తీసుకు వచ్చేటప్పుడు శాంతి పూజ చేస్తారు. దేవత రూపంలో ఉండే కుంకుమ భరణకు ఎటువంటి రక్షణ ఉండదు. ప్రకృతే అమ్మవారికి రక్షణ.

శాంతి పూజ చేసే కొంతదూరం వచ్చాక ముతైదువులు అమ్మవారిని తీసుకొచ్చే వారి కాళ్లు కడిగి పారాణి పెట్టి, దండం పెట్టుకొని మళ్ళీ గద్దె వరకు తీసుకెళ్తారు. ప్రతి బుధవారం,గురువారం సమ్మక్క కు పూజలు చేస్తారు. అమ్మవారి మీద ఉన్న నమ్మకంతో అమ్మవారు గద్దెల మీద లేని సమయంలో కూడా భక్తులు వచ్చి వారి మొక్కుబడులను చెల్లించుకుంటారు. గోవిందరాజులు, పగిడిద్దరాజులు, సారలమ్మ,సమ్మక్క తిరిగి వన ప్రవేశం చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: